ధృఢ సంకల్పం
జన్మ, మృత్యు, జరా, వ్యాధుల యొక్క దురవస్థ ను సదా గుర్తుంచుకోవటం. ఒకవేళ బుద్ధికి - భౌతిక ప్రగతి లేదా ఆధ్యాత్మిక పురోగతి లలో ఏది ఎక్కువ ముఖ్యమో అనే అయోమయంలో ఉంటే - అప్పుడు దానికి ఆత్మ జ్ఞానమును సంపాదించుకునేందుకు కావలసిన ధృడ సంకల్పమును పెంపొందించుకోవడం కష్టముగా ఉంటుంది.
కానీ బుద్ధి కి ఈ ప్రపంచం యొక్క వికృతం పట్ల నమ్మకం కలిగినప్పుడు, అది తన సంకల్పంలో ధృడంగా ఉంటుంది. ఈ ధృడ సంకల్పం పొందటానికి, ఈ భౌతిక లోకంలో, మన ఈ జీవితంలో విడదీయలేనివి గా ఉండే బాధలపై నిరంతర చింతన చేస్తుండాలి. బుద్ధుడిని ఆధ్యాత్మిక పథంలో పెట్టింది ఈ చింతనే. ఆయన ఒక రోగిని చూసి, "ఈ ప్రపంచంలో వ్యాధులు అనేవి ఉన్నాయి నేను కూడా ఏదో ఒకరోజు రోగగ్రస్త మవ్వాల్సిందే." అని అనుకున్నాడు. తరువాత ఒక వృద్ధుడిని చూసి, "ఇక్కడ వృద్ధాప్యం కూడా ఉంది. అంటే నేను కూడా ముసలివాడిని అయిపోవాలి ఒకరోజు." అని అనుకున్నాడు. ఆ తరువాత, ఒక చని పోయిన వ్యక్తిని చూసాడు , "ఇది కూడా జీవనం లో భాగమే, అంటే నేను కూడా ఒక రోజు చనిపోవాల్సిందే" అని తెలుసుకున్నాడు. బుద్ధుడి యొక్క బుద్ధి ఎంత గ్రహణశక్తిగలది అంటే, ఒక్క సారి వీటిని చూసినంతనే అవి ఆయనను ఈ ప్రపంచాన్ని త్యజించేలా చేసాయి. మనకు ఇంకా అంత కుశలత కలిగిన బుద్ధి లేదు కాబట్టి, ప్రపంచం యొక్క వికృతం అవగతం అయ్యే వరకూ, వీటి గురించి నిరంతరం చింతన చేస్తూనే ఉండాలి.
మమకార-ఆసక్తి రహితంగా ఉండుట: అంటే, ప్రాపంచికత్వం పట్ల అనాసక్తి తో ఉండటం. మనకు ఉన్నది ఒక్క మనస్సే మరియు మనం ఆధ్యాత్మిక లక్ష్యములను సాధించాలంటే మనము దానిని భౌతిక వస్తువిషయముల నుండి దూరంచేయాలి. సాధకుడు ప్రాపంచిక మమకార ఆసక్తులకు బదులుగా వాటి స్థానంలో భగవంతుని పట్ల ప్రేమ మరియు మమకారము ను స్థిరపరుస్తాడు.
భార్య (భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటినే పట్టుకునే ఉండకపోవటం. మనస్సుకి కొన్ని విషయముల పట్ల సునాయాసముగా మమకారానుబంధము ఏర్పడిపోతుంది. శారీరిక స్పృహలో, వ్యక్తి అప్రయత్నంగానే కుటుంబసభ్యులను, ఇంటిని - " నావారు, నాది" అనుకుంటాడు. ఇవన్నీ మనసులో తరచుగా తిరుగుతూనే ఉంటాయి మరియు వీటిపై ఆసక్తి మనస్సుని భౌతిక దృక్పథంలోనే కట్టివేస్తాయి. ఆసక్తి/మమకారం అనేది - కుంటుంబ సభ్యులు ఇలాగే ఉండాలి, ఆ విధంగానే ప్రవర్తించాలి అన్న ఆపేక్షను/కోరిక కలుగచేస్తుంది, మరియు ఈ ఆశలు తీరనప్పుడు, అది మానసిక క్షోభకు దారి తీస్తుంది. మరియు అనివార్యముగా, కుటుంబ సభ్యుల నుండి దూరమవ్వటం కూడా సంభవిస్తుంది, తాత్కాలికంగా వారు వేరే చోటికి వెళ్ళినప్పుడు, లేదా శాశ్వతంగా, వారు చనిపోయినప్పుడు. ఇవన్నీ అనుభవాలు మరియు భయాలు మనస్సు పై చాలా భారమును కలిగించి, దానిని భగవంతుని నుండి దూరంగా తీసుకువెళతాయి. కాబట్టి మనము నిత్య శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషిస్తుంటే, మనం భార్య (భర్త), పిల్లలు, ఇల్లు వాటి వాటితో వ్యవహరించేటప్పుడు, మన మనస్సు వాటిల్లో చిక్కుకొని పోకుండా, ప్రాజ్ఞతతో ఉండాలి. ఒక నర్సు హాస్పిటల్లో తన విధి నిర్వర్తించినట్టు, లేదా, ఒక టీచర్ తన విద్యార్థుల పట్ల తన విధిని నిర్వర్తించినట్లు, మమకారాసక్తి లేకుండా, వారి పట్ల మన ధర్మ (కర్తవ్యము) నిర్వర్తించాలి.
అనుకూల లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల సమ-భావన తో ఉండటం. పగలు-రాత్రి లాగా సుఖదాయకమైన లేదా కష్టదాయకమైన పరిస్థితులు పిలవకుండానే వస్తుంటాయి. అదే జీవితం. ఈ ద్వందములకు అతీతముగా ఎదగాలంటే, మనయొక్క ఆధ్యాత్మిక బలాన్ని, ప్రపంచం పట్ల వైరాగ్యం ద్వారా పెంచుకోవాలి. జీవితంలో వ్యతిరేక పరిస్థితులలో కూడా చలించకుండా ఉండే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి మరియు ఏదో విజయం సాధించామని గర్వపడే భావనని కూడా విడిచిపెట్టాలి.
కృష్ణం వందే జగద్గురుమ్
- సేకరణ
ఓం శివోహం