Online Puja Services

గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?

52.15.233.13

 గురువులు

గురువులు ఎన్ని రకాలు ఉంటారు ? గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ? ఏ గురువుని నువ్వు ఎలా  ఆశ్రయించాలి?

1) సూచక గురువు:- బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో  నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. వీరిని సూచక గురువు అంటారు. వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.

2) వాచక గురువు:- ధర్మా ధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థము , వానప్రస్దానం , సన్యాసం )  వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో నివసిస్తావు.

3) బోధక గురువు:- మహా మంత్రాలను ఉపదేశిస్తారు లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని , అలౌఖిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని  వీరిని భోధక గురువు అంటారు. లోకికం నుండి అలౌఖికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు...

4) నిషిద్ద గురువులు:- మారణ ప్రయోగాలు , వశికరణాలు , వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది చిత్తాన్ని శుద్ధి చేయరు విత్తాన్ని హరిస్తారు. ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.)*

5) విహిత గురువు:- మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు , నశించి పోయే విషయ భోగాలు పై ఆసక్తి తగ్గించి, సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేస్తాడు.( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణతో జీవిస్తావు....

6) కారణ గురువు:- ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు. ( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటావు.)

7) పరమ గురువు:- ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు. శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని "అహం బ్రహ్మస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు అవగహన కల్పించి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ "పరమ గురువులు". వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. నీ నిజజీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీజన్మల విడుదలకు మార్గం చూపేవారు ఈ "పరమగురువు"

                      శుభమస్తు 
                  సమస్త లోకా సుఖినోభవంతు 

-వాట్సాప్ సేకరణ 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha