మాకే ఎందుకు ఈ కష్టాలు?
"ఈరోజుల్లో చాలామంది కి ఒక అనుమానం - మేము బాగా పూజలు చేస్తాము మాకే ఎందుకు ఈ కష్టాలు??? మాకే ఈ అనారోగ్యం వచ్చింది అని!!!"
అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు, అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి. అది వదిలించుకునే దానికే పుట్టాము అని గుర్తు ఉంచు కోవాలి...
మన తల్లిదండ్రులు, భాగస్వామీ మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటాము ఎవరూ చెప్పకుండా అర్థం అయిపోతుంది...
ఎంత కష్టంలో కూడా మళ్లీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి, మళ్ళీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడుకి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి,
కష్టాన్ని దాటించే నావలాగ భగవంతుడుని తోడు కోరాలి కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు పుట్టావు భూమి పైన అంటే అది ఋణం తీర్చుకోవడానికి.
దేవుడైన కర్మ భూమిలో పుట్టి కష్టాలు తప్పించు కోలేదు... దాటలేని కష్టం అంటూ ఏది లేదు మనము పటించుకుంటే కష్టం దానిగురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి, అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతుంది.
మనమందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము...
గయ్యాళి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం, బిడ్డలు మీరు చేసిన ఋణాలు, దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం, వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూత దయకు రుణబందాలు...
కనుక నువ్వు ఎవ్వరినీ నిందించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము నా కర్మ కొద్దీ దొరికావు అని అది నిజం మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మనుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది.
మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది.
అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుడుని కొరుకుని , నిత్యం నామ జపం తో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి,
చేతనైన సహాయం చేయాలి, ఒకరికి సహాయం చేయక పోయిన ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పక పోయిన చెడు ప్రచారం చేయకూడదు.
అసూయ, అహంకారం చాలా ప్రమాదం అవి మనకు బద్ద శత్రువులు వాటిని వదిలేయడం మంచిది...
ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం దేనికైనా ఫలితం ఉంటుంది, అది పొందాల్సిందే , అయితే మనము ఏది మూటకట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది.