Online Puja Services

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

18.218.189.36

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.

2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.

3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..

4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.

5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..

6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి  అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...

7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..

8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా  కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.

- సేకరణ 

Quote of the day

Condemn none: if you can stretch out a helping hand, do so. If you cannot, fold your hands, bless your brothers, and let them go their own way.…

__________Swamy Vivekananda