ఎక్కడ చూచిన వీరే యింటింటిముంగిటను పెక్కుచేతలు సేసేరు పిలువరే బాలుల పిన్నవాడు కృష్ణుడు పెద్దవాడు రాముడు వన్నె నిద్ద రమడలవలె నున్నారు వెన్నలు దొంగిలిదురు వీడువాడు నొక్కటే పన్నుగడై వచ్చినారు పట్టరే బాలుల నల్లనివాడు కృష్ణుడు తెల్లనివాడు రాముడు అల్లదివో జోడుకోడెలై వున్నారు వెల్లనిరై తిరిగేరు వేరు లేరిద్దరికిని పెల్లుగ యశోదవద్ద బెట్టరే యీబాలుల రోలజిక్కె నొకడు రోకలివట్టె నొకడు పోలిక సరిబేసికిని బొంచి వున్నారు మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై ఆలించి నె(యె)వ్వరి నేమి ననకురే బాలుల
__________Rabindranath Tagore