కృష్ణానుగ్రహ ప్రదాయకమైన మధురాష్టకం
కృష్ణానుగ్రహ ప్రదాయకమైన మధురాష్టకం
- లక్ష్మి రమణ
పరమాత్ముని దర్శనం ఆ మార్గంలో పయనించినవారికే సాధ్యం . సామాన్యులకి ఆ దివ్య రూపాన్ని దర్శించే అదృష్టాన్ని అటువంటి మహద్భాగ్యాన్ని పొందిన మన ఋషులు, గురువులు, సంకీర్తనాచార్యులు వారి వారి రచనల ద్వారా అందించారు . ఆ రచనల్లో వారు దర్శించిన దివ్య రూపాలని భావన చేత మనమూ దర్శించగలిగిన భాగ్యం మనకి కలగడం మన జన్మ జన్మల సుకృతమే! అలా శ్రీ వల్లభాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రావణ శుక్ల ఏకాదశినాడు దర్శనం చేసుకొని ఆ దివ్యానుభూతిని మధురంగా రచించిన అష్టకం మధురాష్టకం . ఈ మధురాష్టకాన్ని ప్రతిరోజూ చదువుకోవడం వలన ఆ నవనీత చోరుడు మన హృదయమనే నవనీతాన్ని స్వీకరించి, దివ్య జ్ఞానమనే ప్రసాదాన్ని అనుగ్రహిస్తారు . కృష్ణానుగ్రహ ప్రదాయకమైన ఆ దివ్య స్తోత్రాన్ని ఇక్కడ చదువుకోవచ్చు .
మధురాష్టకం
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ ।
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ ।
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 2 ॥
వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ ।
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 3 ॥
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ ।
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 4 ॥
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్ ।
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 5 ॥
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా ।
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 6 ॥
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ ।
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 7 ॥
గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా ।
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 8 ॥
॥ ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ॥