Online Puja Services

అత్యంత మహిమగల హనుమంతుని మంత్రం

3.12.107.192

నాగ కన్య చరిత్ర..!

చాలా అత్యంత మహిమగల... హనుమంతుని..మంత్రం ఉంది...

జపించాలి అనుకునేవారు...
ఒక పేపర్ మీద రాసి..శివాలయంలో..లింగం దగ్గర పెట్టించి..పూజ చేయించుకుని..
మొదలు పెట్టవచ్చు... 
ఎందుకంటే..ఆదిగురువు.. దక్షిణామూర్తి..కదా..!!
దీనివల్ల..చాలా అద్భుతమైన ఫలితాలు..పొందుతారు..!
.
సుషేణుడు అనే గంధర్వ రాజు వున్నాడు.. పావనుడు జ్ఞాని ,సుశీలుడు ,సత్యవ్రతి .
దయా దాక్షిణ్యం వున్న వాడు .
హనుమ పద సేవకుడు .
నిత్యమూ హనుమను జలంతోనూ ,
పంచామృతాలతోను సేవిస్తాడు .
త్రికాల పూజా దురంధరుడు .
దానాలు చేస్తూ ,
హనుమకు ప్రీతిగా హోమాలు చేస్తాడు .
షడ్రసోపేత భక్ష్య భోజ్యములను నైవేద్యం 
పెట్టెవాడు .

ఆ కాలములోనే ”నాగ కన్య ”అనే
అందమైన కన్య వుండేది. ఆమె సుశీల ,సుగుణమణి.,
సత్యవ్రతురాలు.
సర్వసద్గుణ సంపన్న .
ఆమె రక్త రోముడు అనే క్రూర రాక్షసునికి భయపడి గంధర్వ రాజైన సుషేణుడిని శరణు వేడింది .

ఆయనతో ”గాంధర్వ రాజా !
కామాంధుడు ,క్రూరుడు అయిన రక్త రోముడు అనే రాక్షసుడు నాగ లోకం వచ్చి నన్ను బలాత్కారింప ప్రయత్నించాడు .
నన్ను రక్షించేవారు లేక నీ శరణు వేడుకొంటున్నాను” అని వినయంగా మనవి చేసింది.

సుషేణుడు నాగ కన్యతో ”భయం వద్దు అమ్మాయీ !నీ భయం పోగొట్టే ,నీ మనసుకు సంతృప్తి కలిగించే.. ఒక మాట చెబుతాను విను .
వజ్ర దేహుడు అరమ పావనుడు పావని నీకు అండ గా నిలుస్తాడు .
అతడు యజ్ఞ భోక్త .
ఆపన్న రక్షకుడు .
ఆర్తిని పోగొట్టేవాడు 
అలాంటి హనుమ మూల మంత్రాన్ని 
నీకు ఉపదేశిస్తాను .
ఆచరించి ,మనోభీస్టాన్ని పొందు.
నేను కూడా ఆ జపం వల్లే సౌఖ్యంగా వున్నాను .
అని చెప్పి హనుమ మంత్రాన్ని ఉపదేశించాడు.


మంత్రం..!!

”శ్రీ మన్నిరంతర కరుణామృత సాగర వర్షినీం పింగాక్షం అమోఘ మహేంద్రా యుధ క్షతాన్చిత మహా హనుమ అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండలం ,ఆతప్త కార్తస్వర భాస్వర ,కాన్తిచ్చతా కాంతి కలిత ,చూడా విరాజితం అప్రతిమ దివ్య మాణిక్య మండిత గండ భాగం అసమాన మాననీయ ,రామా కాంత ,కర కమల కలిత పంచ జన్య బందుకంబుధారం ,ఇరావత నాసాదండ సుమత్త దీర్ఘ భుజార్గలం ,అనన్య సాధారణ సంకల్ప సంభావాస్తాన పీథ ,పరినాహి బాహ్వంతరం ,అమూల్య పీతాంబరాలంక్రుత కటి ప్రదేశం ,అనవరత వినత జన మనోరధ సాధన పాద యుగళం ,ఉష్ట్ర వాహనం ,అమర గంగానదీ పరివేష్టిత ,హాట కాచల ,వద్దీర్ఘ లాంగూల రంగ ఉత్తుంగ ,మంగ లాంగాకం ,అన్జనానంద వర్ధనం ,అమల ఊర్ధ్వ పుండ్రం ,తదుపరి కర్పూర సమ్మిశ్రిత శుభ్ర విభూతి ధారణం ,యజ్ఞోపవీత తులసీ పద్మాక్ష రుద్రాక్ష మాలాభి రామం ,శ్రీ రామ చంద్ర చరణార వింద ,సంధిత హృదయార విందం , అఖిల కళ్యాణ గుణవంతం హనుమంత ముపాస్మహే

ఆ కన్య హనుమ మంత్రాన్ని జపిస్తూ...
తీవ్రంగా తపస్సు చేసింది .
ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపంతో ప్రత్యక్ష మయాడు .

హనుమ నాగకన్యయను ఉద్దేశించి ”కన్యా మణీ !ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు ?
నీ కోరిక తెలియ జేస్తే నేను నీ కార్యాన్ని సానుకూల పరుస్తాను ”అన్నాడు .

దానికి ఆమె తన కధనంతా వివరంగా 
విన్నవించు కొన్నది .
స్వామి దర్శనం తో తాను ధన్యత చెందానని చెప్పింది .
హనుమ ప్రీత మానసుడై అభయమిచ్చాడు. 
తనతో ఆమెను నాగ లోకానికి తీసుకొని వెళ్ళాడు .
అక్కడ అతి భయంకరుడైన ,అతి బలవంతుడైన 
రక్త రోమ రాక్షసుని చూశాడు .

వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తుండటం గమనించి ”దుష్టుడా !నా ప్రతాపం తెలియక 
విర్ర వీగు తున్నావు .
బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుడిని ”అని తీవ్రంగా హుంకరించి తన తోకతో రక్తరోమున్ని బంధించి నేల మీద విసిరి కొట్టాడు .
ఆ దెబ్బకు వాడు తీవ్రంగా రోదిస్తూ ,రక్తం కక్కుకొని చచ్చాడు .

దేవ యక్ష గాంధర్వ కింపురుషులు పూల వర్షం కురిపించి హనుమను కీర్తించారు . 
హనుమ నాగ కన్యకు దీవేనలిచ్చి అనేక వరాలు అందజేసి ఇక నుంచి భయం లేకుండా నాగ లోకంలో హాయిగా స్వేచ్చగా ఉండమని చెప్పాడు.

అక్కడి నుండి పావని అదృశ్యమై పంపాతీరం చేరి అక్కడ కొంత కాలం వుండి ,
మళ్ళీ గంధ మాదన పర్వతం చేరుకొన్నాడు .

నాగ కన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో ..
భక్తీ తో ఎవరు పఠిస్తారో ..
వారికి అన్ని కార్యాలను దగ్గర వుండి తీరుస్తాడు హనుమ.జై శ్రీరామ్..!! 
స్వస్తి..!!

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya