Online Puja Services

ఒకేఒక్క పద్యంతో ఉరి శిక్షనుండీ తప్పించుకొని రాజయిన కవి !

18.222.132.108

ఒకేఒక్క పద్యంతో ఉరి శిక్షనుండీ తప్పించుకొని రాజయిన కవి ! 
లక్ష్మీ రమణ 

పురాణగాథలకి విస్తృతమైన రూపునిస్తూ, అందమైన కావ్యాలుగా ప్రబంధాలుగా మలిచి,  హృదయానికి హత్తుకుపోయేలా చెప్పినవారు నాటి మన భారతీయకవులు. వీటిల్లో ధర్మ సూక్ష్మాలనూ ,నీటి నియమాలనూ, జీవన గమనాన్ని నిర్దేశిస్తూ గొప్పగొప్ప కావ్యాలని ప్రచురించారు . అటువంటివారిలో ఒక కవీంద్రుడు ఒకేఒక్క పద్యంతో తనకు విధించబడిన ఉరిశిక్షని తప్పించుకోవడమే కాకుండా ఆ రాజ్యానికి రాజయ్యాడు . 

లక్ష్మీమందిరమనే పురాన్ని మదనాభిరామ భూపతి పాలిస్తుండేవాడు. ఆ రాజుకు ‘యామినీ పూర్ణతిలక’ అనే కుమార్తె వుండేది. ఆవిడ రుతగినట్టు , పూర్ణ చంద్రబింబంలా అద్భుతమైన సౌందర్యంతో సుకుమారంగా ఉండేది . రాజు తన కుమార్తెకు విద్య నేర్పించడానికి ‘బిల్హణుడు’ అనే కవిసత్తముని పిలిపిస్తాడు. ఆ కవి కూడా చక్కని సౌందర్యం కలవాడు . అతన్ని చూసి రాజుకు మనసులో ఒక సందేహం కలిగింది.ఇంత అందమైన వానిని చూస్తే నా కుమార్తె ఈతని ప్రేమలో పడిపోతుందేమో! అప్పుడెలా అని మంత్రిని సలహా అడిగాడు.

బిల్హణునికి కుష్టు వ్యాధి వున్నవారిని చూడకూడదనే నియమం వుంది. అలాగే రాకుమారికి గ్రుడ్డివారిని చూడననే నియమంవుంది. దీనిని సాకుగా చేసుకొని కవి గ్రుడ్డివాడని రాకుమర్తెకు, రాకుమారి కుష్ట వ్యాధిగ్రస్తురాలని కవికి చెప్పి, ఒకరినొకరు చూడకుండా మధ్యలో ఒక కాండపటం(పరదావంటిది)పెట్టించి, విద్య మొదలు పెట్టించాడు మంత్రి .

ఒకనాటి సాయంత్రం చంద్రోదయం కాగానే ఆకాశాన్ని చూస్తూ, ఛందోబద్ధంగా అద్భుతమైన పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు బిల్హణుడు . పూర్ణ చంద్రుణ్ణి చూడకుండానే, ఇంతటి మనోహరమైన పద్యాలని ఒక గ్రుడ్డివాడు ఎలా చెపుతున్నాడు అని, కాండపటం తొలగించి పండితుని చూచింది రాకుమారి .

కనులూ కనులూ కలుసుకున్నాయి. మనసూ మనసూ ముడిపడింది . ఇది తండ్రి ఆడిన నాటకమని రాకుమారి అర్థం చేసుకుంది . అయినా ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ సంగతి రాజుగారికి తెలియని తెలిసింది . ఆయన " బిల్హణునికి శిరశ్చేదనం చేయమని” ఆదేశించాడు.

ఇంతకీ ఆ పద్యం ఏమిటంటే, 

‘రవిజుడు భా గుణింప విధురంబుగ భట్టి నశించె,భారవి
ప్రవరుడడంగె దీర్ఘమున బ్రాణము బాసె గుడియ్య భిక్షు, డీ
యవనికి దప్పె భీముడు,దదంత గతి న్మఱి కొమ్మువెట్ట ని 
క్కువముగ నే భుకుండుడను,గొమ్మున దీర్ఘము వెట్టకుండ డీ
భువినత డెన్న నిర్దయుడు,భూపతి వీపు దలంప భూవరా!’

అందులో ఏముందంటే “ఓ రాజా!యమధర్మరాజు ‘భ’గుణింతం వ్రాయటం మొదలుపెట్టాడు. ‘భ’వ్రాయగానే భట్టి మరణించాడు.  ‘భా’ వ్రాయగానే భారవి చనిపోయాడు ‘భి’వ్రాయగానే భిక్షుకుడు మరణించాడు. ‘భీ’ వ్రాయగానే భీమసేనుడు మరణించాడు తరువాత ‘భు’వ్రాస్తే నేను భుకుండుడను(బిల్హణుని నామాంతరం) మరణిస్తాను. తరువాత ‘భూ’ వ్రాస్తే భూపతివి నీనే మరణిస్తావు అని వ్రాసి పంపాడు.

అప్పుడు కవి ఒక పద్యం వ్రాసి తలారులకుఇచ్చి రాజుగారికి చూపమని పంపుతాడు.అది చదివిన రాజు శిక్షను రద్దుచేసి కవికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అప్పటి పండితులకి ఉన్న గౌరవం , వారి మాట కున్న విలువా అలాంటివిమరి ! 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba