Online Puja Services

కష్టాలు ఎవరికి లేవు

3.142.98.111

ఇతను బాగా బతికిన భక్తుడు అని ఒకరి గురించి చెప్పండి ఎవరూ లేరు, అయినా వారి జీవితాలు ఆదర్శంగా చెప్పుకుంటున్నాము కానీ ధనికులు గురించి చరిత్ర రాసుకుని చెప్పుకోవడం లేదు గమనించండి శాశ్వత మైనది ఆధ్యాత్మిక సంపద ఒక్కటే, విలువలు కోసం బతికిన వారే చరిత్రలో గొప్పవాళ్లుగా మిగిలిపోయారు.. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు తినడానికి తిండి లేని రోజులు ఉన్నాయి ఒకసారి ఉత్సవానికి ముందు రోజు ఆ పరమేశ్వరుడు మారు వేషంలో ఆయన ఇంటి ముందు ధాన్యం ఉంచి వెళ్లారు అని చెప్తారు, త్యాగయ్య, రామదాసు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, వీరి జీవితాల్లో కష్టాలు కన్నీళ్లు అనారోగ్యం లేదా.. ఇప్పుడు మీకు ఉన్న స్థితి సంతోషం కనీస సౌకర్యాలు కూడా వారికి లేదు కానీ ఎన్నో కోట్ల మంది జీవితాలకు వెలుగు నింపిన వారు ఈ రోజుకి వీరి పేర్లు వింటే భక్తితో నమస్కారం చేస్తారు కారణం జీవితాన్ని ఆధ్యాత్మికం వైపు సాగిస్తూ యదార్దాన్ని అంగీకరించారు వాస్తవంలో బతుకుతూ ఊహ లోకాలకు వెళ్లకుండా దేవుణ్ణి నిందించకుండా వారి కర్మలు వదిలించుకుని వారు పొందిన చైతన్యాన్ని లోకానికి పంచి మహానుభావులు ఐయ్యారు ఎందరో మహానుభావులు.

శ్రీ రాముడు మనము కొలిచే దేవుడు మానవ ప్రయత్నం తోనే ప్రతి కష్టాన్ని దాటుకుంటూ వచ్చాడు రుద్రాది దేవతలు కూడా రామ నామం జపించే అంత గొప్ప స్థాయికి ఒక మానవుడిగా బతికి చూపించాడు. అంతఃపురం లో రాజ భోగాలు అనుభవించే మహా రాజు అడవిలో ఆ చెట్ల మధ్య ఎండ వాన చలికాలం లో ఆ అడవిలో బతికాడు భార్యను అపహరిస్తే ఆయన పడ్డ బాధ కష్టం అవమానం నిద్రాహారాలు మాని ఎంత కష్టాన్ని భరించాడు, సీతమ్మ తల్లి ఎన్ని బాధలు పడింది ఆమెను అవమణిస్తూ తన భర్తని దూషిస్తూ ఆ మాటలు ఎంత కష్టంగా 10 నెలలు పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎంత రోదించి ఉంటుంది ఒకసారి రాముడి తల అని చెప్పి మాయను సృష్టించి ఆమెకు చూపించారట ఆమె గుండె పగిలేలా ఎడిచిందట రాజ్యాం ఉండి రాముడు అడవిలో బతక లేదా, రాముడు లాంటి భర్త ఉండి సీత కష్టాలు పడలేదా అగ్ని ప్రేవేశం గురించి మాట్లాడుతారే ఈ రోజుకి నా తల్లి అగ్ని పునీత అని అందుకే కధ చెప్పుకుంటున్నాము.. 

రాఘవేంద్ర స్వామి ప్రకృతిని తన స్వాధీనం లోపెట్టుకున్న మహా గొప్ప ఉపాసకుడు మట్టిని బంగారం చేయగల మంత్ర శక్తి కలిగిన మహానుభావుడు కానీ కర్మను అనుసరించి కటిక దారిద్ర్యం అనుభవించాడు కానీ తన మహిమలు స్వలాభం కోసం వాడుకోలేదు. 

ఉన్నదంతా దైవాకార్యం కోసమే ఖర్చుపెట్టి తినడానికి తిండి లేక యాచించే పరిస్థితి లో రామదాసు భార్య కూడా ఆయనతో పాటు యాచించడానికి సిద్దపడింది కానీ అతని భక్తిని నిందించలేదు ఆమె అక్కన్న మాగన్నలకు పెంపుడు కూతురు అల్లారు ముద్దుగా విద్యా బుద్దులతో పెరిగింది తన భర్తకు లేని భోగాలు తనకు అవరసం లేదు అని పుట్టింటి వాళ్ళు పిలిస్తే వెళ్లకుండా భర్త తో పాటు జోలె పట్టుకుని యాచించడానికి సిద్దపడింది కానీ కష్టంలో భర్తను వదల లేదు నిందించ లేదు తర్వాత తనిషా ప్రభువు దగ్గర ఉద్యోగం ఇప్పించారు..

పరమాచార్యులు వారు కామాక్షి స్వరూపం మన జాతి గౌరవం సన్యాస ధర్మానికి నిర్వచనం ఆయన పేరు తలుచుకున్న పాపాలు తొలగిపోతాయి.. ఆయన బాధలు పడలేదా అనారోగ్యం రాలేదా.. 

రామకృష్ణ పరమహంస బాల్యంలో నే భక్తి పట్ల వారి ప్రవర్తన గమనించి తల్లిదండ్రులు వివాహం చేసేసారు కానీ భార్య మొహం కూడా చూడకుండా అదే రాత్రి ఏటో వెళ్లిపోయారు పెళ్లి అయిన రోజే మొగుడు వదిలి వెళ్లిపోయారు అని లోకం తెలియని వయసులో పెళ్లి అయిన ఆ అమ్మయిని ఎందుకు కాకులు లాగా పొడుస్తున్నారు కూడా ఆమెకు అర్థం కాని వయసు తర్వాత ఎప్పటిలో రామకృష్ణ గారు బాగా ప్రసిద్ధ పొంది వారి పెరు అందరికి తెలిసాక ఆమె బట్టలు సర్దుకుని ఆశ్రమానికి వెలింది అక్కడ రోజుకు ఒకరికి గురువుకు సేవ చేసే అవకాశం ఇస్తారు శారాధమ్మ వంతు రావడానికి 2 సం కాలం పట్టింది ఆ రోజు ఆమె అన్ని సపర్యలు చేసి వారి పాదాలు ఒత్తుతూ ఆమె తన భార్య ని తన పేరు శారదా అని పరిచయం చేసుకున్నారు ఆశ్చర్య పోయిన రామకృష్ణ గారు వివరాలు తెలుసుకున్నారు తను వచ్చి 2 సం అయిన ఒక శిష్యురాలు గా ఉన్నదే కానీ ఏ నాడు నేను నీ భార్యని అని చెప్ప లేదు ఎందుకు ద్రోహం చేశారు అని నిలదీయ లేదు ఆక్షణం ఆమె సాక్షాత్తు పరాశక్తి లాగా కనిపించింది ఆ ఔదార్యం సహనం అందరికి సాధ్యం కాదు రామకృష్ణ గారికి ఎంతో ఉన్నతమైన ఆమెను చూసి ఆనందం కలిగింది ఆమె ఏమీ కోరలేదు తనని ఆశ్రమంలో ఒక భక్తురాలిగా ఉండనిస్తే చాలు మీ ఆధ్యాత్మిక మార్గానికి నేను అడ్డురాను అని కోరుకుంది అందరికి ఆమెను తన భార్యగా పరిచయం చేసి ప్రతిరోజు ఆమె తనకి సేవ చేయని చెప్పారు అదే వరం అనుకున్నది ఆమె కానీ అంతటి స్థితప్రజ్ఞత ఉన్న ఆమె సాధారణ స్త్రీ మూర్తి కాదు అని ఆమెకు అమ్మవారిలాగా అలంకారం చేసి పూజ చేసే వారు రామకృష్ణ గారు.వారిరువురూ వివాహం అయిన బ్రహ్మచారులు. 

ఇలా మనము గొప్పగా చెప్పుకుంటున్నా ఎవరి చరిత్ర చూసిన వాళ్ళు ధనికులు అని గొప్పగా చెప్పడం లేదు వారి విలువలు జినవ విధానం అంత ఉన్నత స్థానంలో నిలిపింది మేము బాగా పూజలు చేస్తాము మాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అని అడుగుతారు అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు అయిన కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి అది వదిలించుకునే దానికే పుట్టా ము అని గుర్తు ఉంచు కోవాలి.. మన తల్లిదండ్రులు, భాగస్వామీ మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటాము ఎవరూ చెప్పకుండా అర్థం అయిపోతుంది. 

ఎంత కష్టంలో కూడా మళ్లీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి, మళ్ళీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడు కి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి, కష్టాన్ని దాటించే నావలాగ భగవంతుడు ని తోడు కోరాలి కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు పుట్టావు భూమి పైన అంటే అది ఋణం తీర్చుకోవడానికి. దేవుడైన కర్మ భూమిలో పుట్టి కష్టాలుతప్పించు కోలేదు.. దాటలేని కష్టం అంటూ ఏది లేదు మనము పటించుకుంటే కష్టం దానిగురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి, అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతుంది.. మీ రందరు ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు గైయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం, బిడ్డలు మీరు చేసిన ఋణాలు, దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం, వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూత దయకు రునబందాలు కనుక నువ్వు ఎవ్వరినీ నిందించ డానికి అవకాశం లేదు ఎందుకంటే కోపం తో ఒక మాట అయితే అందరూ అంటాము నా కర్మ కొద్దీ దొరికావు అని అది నిజం మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మనుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది. అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుడు ని కొరుకుని , నిత్యం నామాజపం తో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవిద్దాము.. చేతనైవ సహాయం చేద్దాము ఒకరికి సహాయం చేయక పోయిన ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పక పోయిన చెడు ప్రచారం చేయకూడదు.. అసూయ, అహంకారం చాలా ప్రమాదం అవి మనకు శత్రువులు వాటిని వదిలేద్దాము. ఒకడు కుబేరుడు గా భోగాలు అనుభవిస్తున్నారు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం దేనికైనా ఫలితం ఉంటుంది అది పొందాల్సిందే ,అయితే మనము ఏది మూతకట్టుకుంటామో అదే మనము మిగులుతుంది. 

కర్మల నుండి విముక్తి కలిగించే శక్తి ఒక్క మంత్ర సాధనకే ఉంటుంది ఎందుకంటే మంత్రం లో ప్రతి బీజం ఆమె దైవ స్వరూపంగా ప్రకృతిలో శక్తిని మనము ఆకర్షించే విధంగా చేస్తుంది మన కర్మల నుండి విముక్తి కలిగిస్తుంది దీని గురించి వివరంగా ఇంకో టపా లో తెలుసుకుందాము..

శ్రీ మాత్రే నమః
- భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore