Online Puja Services

నలభై మందికి వంట చెయ్యి

18.117.231.165

పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని కార్వేటినగరంలో మకాం చేస్తున్నప్పుడు స్వామివారి దర్శనానికి శ్రీమతి పట్టమ్మాళ్ వచ్చారు. తన మూడవ కుమార్తెను వెంటపెట్టుకుని వచ్చి తను కాశీ వెళ్లడానికి స్వామివారి ఆశీస్సులను కోరింది. స్వామివారు “కాశీకు వెళ్తున్నావా” అని అడిగి, “కంచిలో శంకరి పాట్టి అని నా భక్తురాలు ఒకామే ఉంది. తనని నీతోపాటు తీసుకునివెళతావా?” అని అడిగారు. వారు సరేనన్నారు. 

మహాస్వామివారు సంతోషంతో ప్రసాదం ఇచ్చి “నువ్వు నాకు ఒక పని చెయ్యగలవా? మట్టపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నలభై మందికి వంట చెయ్యగలవా?” అని అడిగారు. అంతమందికి తను ఎందుకు వండాలో అర్థం కాకపోయినా స్వామివారి మాటను ఎలా కాదనగలదు? కొంతమందిని సహాయంగా తీసుకుని మట్టపల్లి వేంకటేశ్వర ఆలయానికి వెళ్ళి వంట చేసింది.

వంట పూర్తయ్యి చాలాసేపయినా కూడా తినడానికి ఎవరూ రాలేదు. విషయం పరమాచార్య స్వామివారికి తెలపడానికి స్వామివారి వద్దకు వెళ్ళగానే కొన్ని కార్లల్లో తిరుపతి వెళ్తున్నా కొంతమంది భక్తులు కూడా అక్కడకు వచ్చారు. మహాస్వామి వారు కార్వేటినగరంలో ఉన్నారని తెలుసుకుని స్వామివారి దర్శనానికి వచ్చారు వారంతా. స్వామివారు వారిని ఆశీర్వదించి “ఈమె మీకు ఆహారం పెడుతుంది. అందరూ భోజనం చేసినా తరువాత తిరుపతికి బయలుదేరండి” అని ఆదేశించారు స్వామివారు. వారంతా సుష్టుగా భోజనం చేసి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భోజనం చెయ్యడానికి సరిగ్గా ముప్పైఅయిదు మంది వచ్చారు. ఏనాడూ, ఎప్పుడూ మహాస్వామివారి లెక్క తప్పుపోదు. స్వామివారు పట్టమ్మాళ్ ని పిలిచి, “ఎవరూ రాలేదని చెప్పావు, ఇప్పుడు చూశావా? నువ్వు కాశీ వెళ్తున్నట్టు చెప్పావు కదా, అక్కడకి వెళ్లడానికి ముందు సమారాధన చేసినట్టు అవుతుందని నేను ఇలా చేశాను” అని అన్నారు స్వామివారు. కరుణకు అవతలి దరిలేని దైవం పరమాచార్య.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha