Online Puja Services

కాకి నేర్పే అద్వైతం

3.133.143.167

ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు.

స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.

క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు! విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.

అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది.

అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?

అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణంకలిగినది.

మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.

ఇది ఎంతమంది పాటిస్తున్నారు?


కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు.
మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.

కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.

నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు
 
Sekarana: Paramacharya Vaibhavam

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha