Online Puja Services

పిలక పంతులు అని వెక్కిరించినా సరే...

18.117.156.170
మనం మనలాగే ఉండాలి.. విజ్ఞానం
 
అది బ్రిటిష్ కాలం.. ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. " స్కూళ్ళో కొందరు పోకిరీ పిల్లలు పిలక పంతులు అని వెక్కిరిస్తున్నారమ్మా .. పిలక తీసేస్తానమ్మా " అని చెప్పి ఏడ్చాడు. 
 
చూడు నాన్నా.. " నీ పిలక వలన వాళ్ళకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధ పడక్కరలేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టిపెట్టు నీ వలన దేశానికి చాలా ఉపయోగముంది." అంది. 
 
కొంతకాలం తరువాత .." అమ్మా  స్కూళ్ళో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారు .. జంధ్యం మాష్టారు అంటూ వెక్కిరిస్తున్నారు.. అస్తమానూ జంధ్యం పట్టుకొని లాగుతూ అల్లరి చేస్తున్నారు " అంటూ మళ్లీ ఏడ్చాడు. 
 
" నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా.. బాధపడకు. వాళ్ళ చేతలు ,వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు 
అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా.. ?  " అని అనునయించింది. 
 
మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూరప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది. " అమ్మా ! ఇక్కడి వాళ్ళు కోడిగుడ్లు తినమని  నన్ను పొరుపెడుతున్నారు.
బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డుని కలిపేస్తున్నారు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా " అని ఉత్తరం రాసాడు. 
 
"వాళ్ళు ఎన్నిరకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్ళు కాకుల వలే గోలచేస్తే చెయ్యనీ , దోమల వలే రొదపెడితే పెట్టని..  వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశచరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి.  ఏకాగ్రత కోల్పోకు.. నీ చదువుని ఒక తపస్సులా భావించు. 
ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి.ధృఢమైన సంకల్పంతో ముందుకెళ్లు.  " అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది.
 
తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువు పూర్తిచేశాడు. కేంబ్రిడ్జి కి వెళ్ళాడు. ప్రపంచదేశాలు నివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు. 
 
అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త
 " సి.వి.రామన్ " . 
 
తన తల్లి చెప్పిన విలువలను , హితోక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా , ప్రోఫెసర్ గా పనిచేస్తున్నా, మద్రాస్ ఐ.ఐ.టి. కి వైస్ ఛాన్సేల్లెర్ గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకని తీయలేదు. భారతీయతను వదిలిపెట్టలేదు. అందుకే తలపాగా ధరించేవారు. 
 
" Raman the great."
 
అమ్మ
 
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ గారికి తన తల్లి మాట అంటే శిరోధార్యమే.
 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore