Online Puja Services

దైవాన్ని నమ్మిన వాడికి.

18.224.21.26
దైవాన్ని నమ్మిన వాడికి.....
అదృష్టం తలుపు తడుతుంది.
అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు.
 
అదృష్ట వంతున్ని ఎవరు చెడ గొట్ట లేరు. మనవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూచే దురదృష్ట వంతున్ని బాగూ చేయ లేరు. ఉదాహరణగా ఈ కథ..
 
ఒక రాజు గారి కొలువు లో ఇద్దరు పురోహితులున్నారు . అందులో ఒకనిపేరు దైవాధీనం. ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు . జగత్తు అంతా దేవుని అధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనక ఆపేరు వచ్చింది ఆయనకు.
 
రెండో వానిపేరు రాజాధీనం. రాజు గారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖం గా ఉన్నారని నమ్మే వాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. .రాజు గారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందు కునే వాడు .
 
ఒక రోజు రాజు గారికి రాజాదీనం గారిని సువర్ణ ,వజ్ర వైదూర్యాలతో సత్క రించాలని కోరిక కలిగింది .అదీ ఎవరికీ తెలీకుండా రహస్యం గా చేయాలని భావించాడు .ఒక గుమ్మడి కాయ ను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైదూర్య రత్న మాణిక్య సువర్నాలను నిక్షేపం చేసి రాజాదీనం గారికి స దక్షిణం గా దానం చేశాడు .ఆయన దాన్ని ఇంటికి మోసుకు పోతూ ఆలోచించాడు. " దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది" అని. ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టి గారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసు కొని ఇంటికి వెళ్లాడు .
 
శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది . "గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరు తో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తిపరాయణులైన వారికి దానం చేస్తాను." అను కొన్నాడు .అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కని పించారు . సెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణ తో సహా కూష్మాండ దానం (గుమ్మడికాయ దానం) చేశారు . దైవాధీనం గారి భార్య .... భర్త తెచ్చిన గుమ్మడి కాయను పగుల గొట్టించింది భర్త చేత .ఆడ వాళ్ళు గుమ్మడి కాయ పగుల గొట్ట రాదనీ ఆచారం కదా అందుచేత .అందులో వజ్రవైదూర్య మరకత మాణిక్య సువర్నాలు కని పించాయి .ఇదంతా దైవ లీల గా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు.
 
మర్నాడు రాజాదీనం రాజ దర్శనానికి వెళ్లాడు ."గుమ్మడి కాయ కూర తిన్నారా..." అని రాజు అడిగాడు . ఆహా ,ఓహో అద్భుతం అని బొంకారు రాజాధీనంగారు. .రాజు గారికి అర్ధమైంది .... గుమ్మడి కాయ ఆయన ఇంటికిచేర లేదని . ఒల్లుమండింది. భటులను పిలిపించి కొరడా తో ఝాలిపించి నిజం కక్కించాడు .
 
శెట్టి ని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని దాన్ని కొన్నాననీ... దైవాధీనం గారికి దానం చేశాననీ.. చెప్పాడు .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాడేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు .
 
మరోసారి ఒక సంచి లో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి ... భటుడి ని కని పించ కుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు.
 
రాజదీనం నడచి వస్తు ,దాన్ని గమనించ కుండా వెళ్లి పోయాడు .భటుడు రాజుగారికి విషయం తెలిపాడు .ఆయన మళ్ళీ ఆశ్చరయం లో మునిగాడు . రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడ లేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసు కొని వెళ్ళ లేనా అని అక్కడికి రాగానే అని పించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా.అని బదులు చెప్పాడు.
 
రాజుకి అర్తాధమైంది... తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని.
 
"దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది "అని ఇందులో ఉన్న సారాంశం.
 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha