నమ్మిన వారికే ఫలం

ఒక అమ్మాయి ఈ ఊరు నుండి వేరే ఊరుకు వాడుక పాలు అమ్మడానికి వెళ్తూ వస్తూ ఉండేది. అదే ఊరిలో ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు కూడా వాడుక పాలు పోస్తూ వస్తుండేది. . ఈమె ఒకరోజు పాలు పోయడానికి లేటుగా వెళ్ళింది.
ఎందుకమ్మా లేటుగా వచ్చావు అని అడిగాడు బ్రాహ్మణుడు. అందుకు ఆమె పైన వర్షం పడిది గురువుగారు . నది పోంగింది రావడం వీలు కాలేదు. తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చాను అని చెప్పింది.
దానికి వేదపండితుడు రామ నామం జపం చేయమ్మా. మేము రామ నామంతో భవసాగరాన్ని దాటాము. నిన్ను నదిని దాటిస్తుంది అని చెప్పాడు.
ఆమె నిజంగానే రామ నామం నదిని దాటిస్తుంది అనుకుంది. మరో నాలుగు రోజుల తర్వాత వర్షం పడింది. ఆమె పాలు పోయడానికి వచ్చింది.
వేద బ్రాహ్మణుడు అడిగాడు. ఏమమ్మా ఈ రోజు వర్షం పడింది కదా ఎలా వచ్చావు అని అడిగాడు.
ఆమె అన్నది మీరు రామ నామం చెప్పారు కదా, రామా రామా అనుకుంటు నది దాటి వచ్చాను అని చెప్పింది.
ఆపుడు వేద బ్రాహ్మణుడికి ఆశ్చర్యం కలిగింది. నిజమా?? నిజమే గురువు గారు అన్నది.
ఆయనకు ఆశ్చర్యం కలిగింది.
ఏది, నది వద్దకు పోదాం పద అని వెళ్లారు.
ఆమె రామ రామ అనుకుంటూ నదిని దాటి వెళ్ళిపోయింది అవతలి ఒడ్డుకు.
ఈ వేదపండితుడు నదిని దాటి పోతామని పంచే పైకి పట్టుకొని రామా రామా అనుకుంటూ నదిని దాటపోయాడు. అంతే మునిగిపోయాడు.
కొందరు అతనిని తీసి ఒడ్డుకు చేర్చారు.
అతను చెప్పిన నామానికి అతనికి విశ్వాసం లేదు కానీ అతను చెప్పిన నామం పై విశ్వాసం కలిగింది ఆమెకు. అంతే నదిని దాటింది. వేద పండితుడికి నామం పై నమ్మకం లేదు. అందుకే ఆయన మునిగిపోయాడు.
దేవుడిపై, దైవ నామం పై, మంత్రం పై 100% విశ్వాసం ఉండాలి.