Online Puja Services

శివాజీ పై తల్లి ప్రభావం

18.118.165.153

ఒక చిన్న పాప కిటికీలోనుండి చూస్తూ ఉందీ ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు వెంటనే ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్లి ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ కోరింది. ఆతండ్రి పాపను దగ్గరకు తీసుకుని మనం మొఘలుల ఆదీనంలో ఉన్నామనీ అడ్డుకోవడం అసాద్యమనీ చెప్తాడు దానితో నిర్ఘాంతపోయిన ఆపాప బాధగా వెనుతిరిగింది.

పాప పెరిగి పెద్దది అయ్యింది పెళ్లి జరిగింది ఒక రోజున అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిల్చుని బయటకు చూస్తున్న ఆమెకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయం ధ్వంసం చేయడం కనిపిస్తుంది హుటాహుటిన భర్త వద్దకు వెళ్లి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారనీ అడ్డుకోవాలనీ చెపుతుంది దానికి ఆ భర్త మనం ఖిల్జియా ప్రభువుల ఆదీనంలో ఉన్నా మనీ అడ్డుకుంటే మరణ శిక్ష విధిస్తారనీ చెప్తాడు ఈ సమాధాంతో ఏమాత్రం సంతృప్తి చెందని ఆమే ఇటువంటి సమాధానం మళ్ళీ వినకూడదూ అనుకుంటుంది.

కొంతకాలానికి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది
ఆ బిడ్డకు చిన్నతనం నుంచే రామాయణ మహాభారత గాధలు పురాణాలు వాటిలోని మంచి చెడులు హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలి ధర్మాన్ని ఎలా పరిరక్షించాలీ స్త్రీలపట్ల గౌరవ మర్యాదలతో మెలగడం యుద్ద విద్యలు ఇలా అన్నీ వివరంగా చెబుతూ పెంచసాగింది.

కాలక్రమంలో ఒకరోజున వీధి చివరన దేవాలయాని ధ్వంసం చేస్తుండటం చూసి కొడుకును పిలుస్తున్న ఆమె పిలుపు పూర్తవకుండానే మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని సింహగర్జన చేస్తూ దుండగులపై విజృంభించి భవానీమాతా వర ప్రసాదమైన ఖడ్గంతో ఒకేఒక్క దెబ్బతో శతశిరఛ్ఛేదనం గావించి స్వరాజ్య సామ్రాజ్యమే తన లక్ష్యం గా ధర్మ పరిరక్షణే తన ద్యేయంగా నవాబుల పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడా నూనూగు మీసాల పదిహేడు ఏళ్ళ యువకుడు.

ఆ తల్లి పేరు జిజియా భాయి ఆ కొడుకు పేరు శివాజీ భోంస్లే (ఛత్రపతి శివాజీ మహారాజ్)
తన పదిహేడవ ఏట ప్రారంభించిన ఉద్యమంతో జీవితాంతం అలుపెరగని పోరాటాలు చేసి
దాదాపుగా మొఘలుల పాలనకు స్వస్తి చెప్పి మరాఠ దేశంలో అన్ని ప్రాంతాలనూ కోటలనూ కైవసం చేసుకుని
ధర్మగ్లాని గావిస్తున్న వారి శిరఛ్ఛేధనం చేసి ధర్మాన్ని నాలుగు పాదాలపై మొహరింపజేసి యావధ్బారతావనీ జయహో ఛత్రపతి అనే విధంగా పరిపాలన సాగించి అజరామర కీర్తి ప్రతిష్టలు కైవసం చేసుకున్న మన శివాజీ కి జోహార్లు అర్పించుకుందాం.

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha