Online Puja Services

యాదవ ముసలం-కృష్ణ నిర్యాణం

3.14.126.32

యాదవ ముసలం-కృష్ణ నిర్యాణం !  

మహా భారతం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ కృష్ణుడు .
 కృష్ణ లీలలు . కౌరవ పాండవ వైరం . కురుక్షేత్ర యుద్ధం .

కాని తక్కువ తెలిసిన కధల్లో శ్రీ కృష్ణ నిర్యాణం .

కురుక్షేత్ర యుద్ధం తరువాత శోకం లో ఉన్న గాంధారి కౌరవ కుల వినాశనానికి కృష్ణుడే కారణమని భావించి యుద్ధం ముగిసిన రోజునుండి 36ఏళ్ళ తరువాత నీ యాదవ కులం అంతా నా వంశం నశించినట్టు నశిస్తుందని శాపించింది .

ఏళ్ళు గడచి పోతున్నై ,ఒక రోజు విశ్వామిత్రుడు ,నారదుడు ,మొదలగు మహా ఋషులు తమ శిష్యులతో కృష్ణుని చూడటాని వచ్చారు . వారిని చూసిన యాదవులు అమిత గర్వం తో ,ఋషులను ఆట పట్టించాలని వారిలో ఒకడైన కృష్ణ కుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి వారి వద్దకు వెళ్లి 
"ఈమెకు సంతానం కలుగుతుందా ?"అని అడిగారు .

వారి ఆకతాయి పనికి కోపం వచ్చిన ఋషులు "కృష్ణుని కుమారుడైన ఈ సాంబుడు యాదవ వంశ నాశనానికి కారణమైన రోకలిని కంటాడు . మా మాట జరిగి తీరుతుంది పొండి . బలరామకృష్ణులు తప్ప అందరు రోకలి కున్న దైవశక్తి తో చనిపోతారు ." అని కృష్ణుని చూడకుండానే వెనక్కి వెళ్లి పోయారు .

ఈ సంగతి తెలిసిన యాదవ పెద్దలు కృష్ణుని వద్ద బాధ పడ్డారు . విధిని ఎదిరించాలేము . అన్నాడు . మరుసటి రోజు సాంబుడి కడుపు నుండి రోకలిబైటపడింది . దాన్ని యాదవ పెద్దలు పొడిపొడిగా చేసి సముద్రంలో కలిపారు . తమ ఆపద పోయిందని ఆనందపడ్డారు .

కాని కొంతకాలానికి యాదులందరికి పీడా కలలు వచ్చి కలవరపరచాయి .ఒకనాడు దేవతలు కలలో చెప్పినట్లుగా అనేక రకాల పిండివంటలు ,పూజ సామగ్రి తో ద్వారకా పట్టాణ సముద్ర తీరంకి వెళ్లి క్రీదించారు . బలరాముడు ,ఉద్దవుడు అడవికి వెళ్లి చెట్టు నీడన కూర్చునాడు బలరాముడు .

యాదవుల దగ్గరకు కొతుల గుంపు వస్తే వాటికి తిండి పెట్టారు . కొద్దిసేపటితరువాత మత్తులో ఉన్న యాదవులు అందరు గత యుద్ధవిషయాలు ,లోపాలు చర్చిస్తూ ఆవేశపడి ఒకరిని ఒకరు ఒకరు సముద్రపు ఒడ్డున ఏపుగా పెరిగిన తుంగ పరకలతో (మత్తులో వాటినే కత్తులుగా ,రోకళ్ళు గా అనుకున్నారు) చంపుకున్నారు . సముద్రం లో కలిపినా రోకలి పొడే తీరం లో తుంగ లా పెరిగింది . మిగిలిన వారిని కృష్ణుడుకోపంతో అదే తుంగతో కొట్టి చంపాడు .

ఇక్కడ మనకు కృష్ణుని లోని మానవ అంశం కనిపిస్తుంది . ఆయన మీద కూడా ఋషుల శాపం పనిచేసింది ,అంటే కాదు గర్భ శోకం తో గాంధారి పెట్టిన శాపం కూడా పనిచేసింది .
అడవికి వెళ్ళిన బలరాముని వెతుకుతూవెళ్ళిన కృష్ణుడు తన రాధా సారధిని పాండవులదగ్గరకు వెళ్లి జరిగిన యదు వంశ నాశనం గురించి చెప్పి అర్జునుని వెంట తీసుకుని రమ్మన్నాడు . 

అన్న గారిని చెట్టు నీడలో చూసిన కృష్ణుడు "అన్న యదు వంశ నాశనం రుషి ,గాంధారి శాపం ప్రకారం జరిగింది . నేను స్త్రీలను ,గజ ,ఆశ్వ వాహనాలను నగరంలో తండ్రిగారి వద్ద వదిలి వస్తాను . " అని చెప్పి నగరానికి వచ్చి తండ్రి వాసుదేవుడికి జరిగిన విషయం తెలిపి ,అర్జునుడు ద్వారకా వాసులను తనతో తీసుకు వేల్తాడు , త్వరలో ద్వారకా నగరం సముద్రం లో మునిగి పోతుందని అని చెప్పి తానూ బలరాముడి వద్దకువెళ్ళి తండ్రి అనుమతితో వచ్చానని అనగానే
బలరాముడి ముఖం నుండి ఎర్రని వెలుగులు చిమ్ముతూ వెయ్యి తలల పాము ఆకాశం మెరిసేలా బైటకు వచ్చి సముద్రం లోకి వెళ్ళింది . నాగలోకంలోని నాగులు ఆదిశేషునికి స్వాగతం పలికారు. 
 
అన్నగారి దేహ త్యాగం తరువాత కృష్ణుడు అడవి లో తిరుగుతూ అలసి సూర్యాస్తమయ వేళ ఒక చెట్టు క్రింద పడుకున్నాడు ఇంతలో జరా అనే రక్కసి కృష్ణుని పాదాన్నిజింక తల లాగ భ్రమింపచేసింది . వేటగాడు జింక అనుకోని బాణం తో కొట్టాడు . వేటగాడు వేటను తీసుకుందామని వెళ్లి చూస్తె మరణ వేదన పడుతున్న కృష్ణుని చూసి జరిగిన పొరపాటుకి కాళ్ళ మీద పడి ఎడిచాడు .

తన అవసరం భూమి మీద తీరిందని ,నీ తప్పు కాదని ఓదార్చి కృష్ణుడు దేహ త్యాగం చేసి స్వ స్థలానికి చేరాడు . దేవతలు ఆనందం తో కీర్తించారు .

కనుక పిల్లలు ఏదో మునులను ఆట పట్టించాలని చేసిన పని చివరికి చెడు ఫలితం ఇచ్చింది . అంటే కాకుండాఎంతటి గొప్ప వంశములు అయినా సరే మితి మీరిన అహంకారం సమూలనాశనానికి కారణం అని కౌరవ యదు వంశ నాశనం భావి తరాలకు భారతకధ ద్వార హెచ్చరిస్తోంది .

- Lalitha Rani

Quote of the day

Once you start a working on something, don't be afraid of failure and don't abandon it. People who work sincerely are the happiest.…

__________Chanakya