శ్రీ కృష్ణుడు నేర్పిన గుణపాఠం
శ్రీ కృష్ణుడు నేర్పిన గుణపాఠం
ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో
‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్యకదా!
ఆమె నాకంటే అందంగా ఉండేదా?’
అని అడిగింది.
ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు
‘ప్రభూ,
నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’
అన్నాడు.
పక్కనే ఉన్న సుదర్శనుడు
(సుదర్శన చక్రం)
కూడా.. ‘పరంధామా,
అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.
నాతో సరి తూగు వారెవరు స్వామి’
అన్నది.
ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.
దీర్ఘంగా ఆలోచించి..
‘సత్యా, నువ్వు సీతగా మారిపో.
నేను రాముణ్నవు తాను.
గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.
చక్రమా,
నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’
అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.
గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి..
సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు.
హనుమ ఆనందంతో పుల కించిపోతూ..
‘నేను నీ వెనుకే వస్తాను.
నువ్వు పద’
అని గరుత్మంతు ని సాగ నంపుతాడు.
ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా అను కుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు.
కానీ..
ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతు నికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.
ఇంతలో..
‘హనుమా’
అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు.
‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’
అని అడగ్గా..
హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ
‘ప్రభూ,
ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.
ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’
అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు.
ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ
పై పడి
‘స్వామీ,
మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా!
ఎవ రీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.
అలా కృష్ణ
పర మాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలు వేమిటో తెలియ చెప్పాడు.