సమర్పించుట అంటే??
*సమర్పించుట.....*
ఓక శిష్యుడు వారి గురువు గారితో..
"మీరు మీ శక్తులన్నిటినీ శివుడి వైపే కేంద్రీకరించాలి. అది మీ ప్రేమ కానివ్వండి, వాంఛ కానివ్వండి, క్రోధం కానివ్వండి, అత్యాశ కానివ్వండి, అన్నీ శివుడివైపే ఉండాలి’’ అని అంటారు కదా.. మన ప్రేమ, వాంఛ, అత్యాశలను కూడా శివుడి వైపెలా కేంద్రీకరిస్తాం..? ప్రేమ అంటే అర్థం చేసుకోవచ్చు. తక్కినవి, నాకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది అని అనగా..
గరువు శిష్యుడు తో.. మీరు మీ జీవితంలో ఏం చేసినాసరే, మీ దగ్గర ఉన్నదానితోనే చేయగలరు. మీ దగ్గర లేనిదానితో ఏ పనీ చేయలేరు. అందువల్ల మీ దగ్గర ఏమున్నా, దాన్నే ఉపయోగించండి. దీనివల్ల శివుడికి ఏమన్నా లభిస్తుందా లేదా అన్నది సమస్య కాదు. నిజంగా ఆయనకు మీ నుండి ఏమీ అవసరం లేదు. ముఖ్యమైన విషయమేమంటే మీరు మీ శక్తినంతటినీ ఒకే దిశగా నడపడం నేర్చుకోవాలి. మీరలా మీ శక్తినంతటినీ ఒకే దిశగా నడపకపోతే మీరెక్కడికీ చేరుకోలేరు.
మీరిది అర్థం చేసుకోవాలని నా కోరిక, మీలో ప్రేమా లేదు, ద్వేషమూ లేదు, వాంఛా లేదు, అసూయా లేదు. మీలో కేవలం జీవం మాత్రమే ఉంది.
మీ ప్రేమ శివుడిపై, మీ వాంఛ ఎవరో పొరుగువారిపై, మీ ద్వేషం మరొకరిపై.. ఈ విధంగా అయితే మీరొకేసారి ఐదు దిక్కులకు ప్రయాణించవలసి ఉంటుంది. ఒకేసారి ఐదు మార్గాల్లో వెళ్ళాలి అని అనుకుంటున్నాడంటే.. వాడి ప్రయాణంలో నిజాయితి లేదని అర్థం. కాని మీరిప్పుడు ఒకే దిశగా మీ శక్తినంతా ఉపయోగిస్తే మీరు ఏదో ఒక చోటికి చేరగలుగుతారు. మీరిది అర్థం చేసుకోవాలని నా కోరిక, మీలో ప్రేమా లేదు, ద్వేషమూ లేదు, వాంఛా లేదు, అసూయా లేదు. మీలో కేవలం జీవం మాత్రమే ఉంది. దానితో ఎం చేస్తారన్నది, మీమీదే ఆధారపడి ఉంటుంది. అందులో నుండి ప్రేమని, ఆనందాన్ని, నిరాశ, నిస్పృహలని అలా ఏవైనా తీయవచ్చు. మీరు దాన్ని సంతోషకరం చేసుకోవచ్చు, దుఃఖదాయకం, వికారం చేసుకోవచ్చు, సుందరమూ చేసుకోవచ్చు.
ఓ చిన్న కథ...
మైసూరుకు వెళ్లే దారిలో నంజన్ గుండు అనే ఒక ప్రదేశం ఉంది. నంజన్ గుండు దాటిన వెంటనే ఎడమవైపు మల్లన్న మూలై అనే చిన్న ఆశ్రమం వస్తుంది. వందేళ్ల కిందట అక్కడ మల్లన్న అనే వ్యక్తి ఉండేవాడు. దక్షిణ భారతదేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించి సుందరంగా తీర్చిదిద్దిన కొద్ది నగరాల్లో మైసూరు ఒకటి. ప్రజలు వ్యాపారం కోసం, ఉపాధికోసం, వినోదం కోసం, అనేక అవసరాల కోసం మైసూరు వెళతారు. నడిచో, ఎడ్లబండి మీదో వెళతారు. కాని వాళ్లు మైసూరుకు ఇంకా 16 మైళ్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి రాగానే మల్లన్న వాళ్లను దోచుకొనేవాడు. ప్రజలకిది బాగా తెలిసిపోయింది. అతనితో ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. దీంతో మల్లన్న ఒక సుంకరి అయ్యాడు. ఆ ఊరు దాటి వెళ్లే ప్రతి వ్యక్తీ ఒక రూపాయి సుంకం చెల్లించాలి. ఆ రోజుల్లో అదేమీ తక్కువ డబ్బు కాదు. ప్రజలకి అతనంటే అసహ్యం. అందుకే అతన్ని ‘కళ్ళ’ అనిపిల్చేవాళ్లు. అంటే దొంగ అని అర్థం. ఆ ప్రదేశానికి ‘కళ్ళనమూలై’ అని పేరు వచ్చింది. అంటే ‘దొంగ ఉండే మూల’ అని అర్థం.
సమర్పణలో మీ జీవితం ఏకముఖమవుతుంది. ఆ తర్వాత అది కదలడం ప్రారంభిస్తుంది. అది ఐదు ముఖాలుగా సాగితే ఎక్కడికీ చేరుకోలేదు.
అతను సంవత్సరమంతా డబ్బు వసూలు చేసేవాడు. మహాశివరాత్రి నాడు వైభవంగా ఉత్సవం చేసి, ఊరి వాళ్లందరికీ విందు ఇచ్చేవాడు. ఈ డబ్బుని అతను వాడుకొనేవాడు కాదు. అతనికి కొద్దిగా పొలం ఉంది. ఆ పంట ద్వారా తన జీవనోపాధిని సాగించేవాడు. వసూలు చేసిన డబ్బంతా శివరాత్రి ఉత్సవానికే ఖర్చు చేసేవాడు. ఒకసారి ఇద్దరు గొప్ప వీరశైవభక్తులు అతనేం చేస్తున్నాడో చూడడానికి ఆ తోవన వచ్చారు. వాళ్లంతా గమనించారు. మల్లన్న దోపిడీ చేస్తున్నాడు, ఆ డబ్బుతో శివరాత్రి పండుగ జరుపుతున్నాడు. ఈ రకమైన భక్తి చూసి వాళ్లకు ఇబ్బందిగా అనిపించింది. వాళ్లు అతనితో ‘‘పండగ జరపడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి’’ అని చెప్పి ఒప్పించారు. వాళ్లక్కడే చిన్న ఆశ్రమం నిర్మించారు. మల్లన్న కూడా వారిలో చేరిపోయాడు. ముగ్గురూ మహాసమాధి పొందారు.
శివుడు తన భక్తుల చేసే పనుల వల్ల ఎలా ప్రసన్నుడయ్యాడో చెప్పే కథలెన్నో ఉన్నాయి.. ఆయన సంతోషపడేది వాళ్లు బంగారు ముద్దలనో లేక వజ్రాలో ఇస్తున్నారని కాదు. కాని వాళ్లు, వాళ్ల దగ్గరేముందో అది ఇస్తున్నారు కాబట్టి సంతోషిస్తున్నాడు. ‘‘మీ దగ్గర ఏమి ఉంటే అదే సమర్పించండి’’ అన్నది సందేశం. ఎందుకంటే మీ వద్ద లేనిది మీరు సమర్పించలేకపోవడం సహజం. అంటే మీరు ఏమిస్తున్నారన్నది ముఖ్యం కాదు, మీరు మీ జీవితాన్ని సమర్పించండి. సమర్పణలో మీ జీవితం ఏకముఖమవుతుంది...