Online Puja Services

హనుమాన్ లాంగూల పూజ .

3.15.214.185

అథర్వణ వేదాంతర్గతమైన హనుమాన్ లాంగూల పూజ . 
- లక్ష్మి రమణ 

“నరుడికి లేనిది , వానరుడికి ఉన్నది అదొక్కటే !” అని అప్పుడప్పుడూ పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు . ఆ ఒక్కటీ  వానరసేనలోని ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, హనుమంతుని ప్రత్యేకత వేరు వేరు. ఆ ప్రత్యేకత సముద్రాన్ని లంఘించడంలోనిది మాత్రమే కాదు, తన తోకతో లంకకి నిప్పు పెట్టినది కూడా ! అంతేనా ? కాదు, సీతమ్మ శోకాన్ని తగ్గించిన ఘనత కలిగిన మహా అస్త్రము కూడా ! ఆ లాంగూలము ఇప్పటికీ భక్తులని కాచే దివ్యాస్త్రమే ! ఆ తోకలోని మహత్తేమిటో పూర్తిగా తెలుసుకుంటే, వెంటనే మీరూ లాంగూలపూజ చేస్తారు మరి ! 

జ్వలత్కాంచన వర్ణాయ దీర్ఘ లాంగూల ధారిణే 
సౌమిత్రీ జయదాత్రేచ రామదూతాయ తే నమః 

అని  నారద పురాణం హనుమంతుని, ఆయన దీర్ఘమైన తోకని ప్రస్తుతిస్తుంది. వానరుడు కాబట్టి ఆయనకీ తోకుంది . అందులో ప్రత్యేకత ఏముంది అనుకునేరు ! ఆ తోకలోనే ఉంది మహత్తంతా!! ఆయనా ఆజన్మ బ్రహ్మచారిగా దివికి వచ్చిన రుద్రుడు.  మరి ఆయన శక్తి, శక్తి స్వరూపిణి అయిన ఆ దేవదేవి ఏ రూపంలో అయన వెంటవుండాలి ? అందుకే సదా  ఆయన లాంగూలమై  హనుమ వెంటే ఉన్నారు.  హనుమంతుని లాంగూలాన్ని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోతాయి. అదీ ఆ తోక మహత్యం.  ఆయన లాంగూలము ఒక శక్తి ఆయుధం లాంటిది. ఏవిధంగా దానిని పూజించాలి ?  అలా చేసినవారి అనుభవం ఏమిటి ? తెలుసుకునే  ప్రయత్నం చేద్దాం రండి .   

తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసా ని నిత్యమూ పారాయణ చేస్తూంటాం కదా ! ఆయన గొప్ప రామ భక్తుడు .  రామ భక్తులకి దాసుడు హనుమయ్య . ఒకసారి తులసీ దాసుగారు కాశీ క్షేత్రానికి వెళ్లారు . అక్కడ కాలభైరవ దర్శనం చేయకుండానే తిరిగి వచ్చేశారు . దాంతో ఆయన కోపించి, తులసీ దాసు చేతికి తీవ్రమైన పీడని కలిగేలా చేశారు.  ఎంతమంది వైద్యులని కలిశినా ఆ బాధ తీవ్రత తగ్గనే లేదు . చివరికి ఆ హనుమంతుని శరణువేడి , స్వామీ , నీ లాంగూల స్పర్శ చేత ఈ బాధని , నా దుఃఖాన్ని తగ్గించవయ్యా ! అని ‘హనుమాన్ బాహుక్’  అనే స్తోత్రంతో స్తుతించారు. వెంటనే ఆయనకీ ఆ బాహువుల్లో కలిగిన బాధ తగ్గి శాంతి కలిగింది . 

ఈ విధంగా హనుమంతుని లాంగూలాగ్రాన్ని పూజించడం అనేది దుఃఖాన్ని , కష్టాలని, బాధలని తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది . రోగాలని తగ్గించి, సర్వ రోగాల నుండీ, అన్ని రకాల విష జ్వరాల నుండీ రక్షించే హనుమాన్ లాంగూల స్తోత్రం  ఈశ్వరుడే చెప్పారని అథర్వణ వేదం చెబుతుంది . ఈ స్తోత్రం చక్కని , చిక్కని సంస్కృతంలో ఉంటుంది .  దీన్ని హితోక్తి మీకు అందిస్తోంది . చదువుకోగలిగితే , గురువు గారి సాన్నిధ్యంలో చేసుకోగలిగితే మంచిది . లాంగూల ఉపనిషత్ డా పిలిచే అథర్వణ వేదాంతర్గతమైన రహస్య స్తోత్రం ఇది . 

ఇక తేలికగా చేసుకో గలిగేది,  శత్రు నాశనం చేసేది , శాంతిని ప్రసాదించేది  అయిన  లాంగూలాస్త్ర స్తోత్రాన్ని కూడా హితోక్తి మీకు అందిస్తోంది . ఈ స్తోత్రాన్ని నిత్యమూ పఠించడం విశేషించి, మంగళ , శనివారాలలో చేసుకోవడం గొప్ప ఫలితాలని అనుగ్రహిస్తుంది.  

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi