Online Puja Services

మాఘ గౌరి నోము .

3.146.34.148

వితంతువు నోచినా, సౌభాగ్యంతో ఆశీర్వదించే , మాఘ గౌరి నోము . 
లక్ష్మీ రమణ 

నోములనేవి సంప్రదాయ బద్ధంగా వచ్చేవి. చిన్న చిన్న సూక్ష్మాలతో ఇహపర సౌఖ్యాలని అనుగ్రహించేవి. నమ్మకంతో ఆచరిస్తే ఖచ్చితమైన ఫలితాన్ని అనుగ్రహించేవి . అటువంటి వాటిలో ఒకటి మాఘ గౌరీ నోము . వితంతువు నోచినా సౌభాగ్యంతో వర్ధిల్లిందనే కథలోనే, ఈనోము విశిష్ఠత దాగిఉంది . ఈ జన్మలో సాధ్యం కానిదైతే , వచ్చే జన్మలోనైనా ఆ పుణ్యం వెన్నంటి వస్తుందని నమ్మకం . ఈ నోము విధి విధానాలు ఇక్కడ మీకోసం . 
 

నోము కథ :
పూర్వకాలం, ఒకానొక అగ్రహారంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు.  వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు భూలక్ష్మి. పేరుకి తగ్గట్టు చక్కని రూపం, అంతటి ఓర్పూ, నేర్పున్న వ్యక్తిత్వం భూలక్ష్మిది. యుక్తవయసు రాగానే తల్లిదండ్రులు చక్కని యువకున్ని చూసి పెళ్లి చేశారు.కానీ విధి ఆడే వింత నాటకంలో భాగంగా ఆమెకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించింది. అప్పుడా తల్లిదండ్రులు ఆమెను వెంటబెట్టుకొని తీర్థయాత్రలు చేయసాగారు . 

ఒకరోజు తామున్న చోట కొంతమంది స్త్రీలు కూడి గౌరీ పూజని చేయడాన్ని గమనించారు . ఆ స్త్రీలు ఆ ప్రదేశాన్నంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి దీపములు వెలిగిస్తున్నారు. వీళ్ళు ముగ్గురూ కూడా వెళ్లి, వీరితో కలిసి దీపాలు వెలిగించారు . అప్పుడు భూలక్ష్మిని చూసి అనుగ్రహించిన గౌరీ దేవి, ఆమెను  దగ్గరకు పిలిచి -ఏమమ్మా ! బాల్యములోనే వైధవ్యం ప్రాప్తించినదా ! చింతించకు, బాధపడకు.  నే చెప్పినట్లు చేయి. నదిలోని ఇసుకను 5 కుప్పలుగా చేయి వరుసగా పోయి. ఆతర్వాత ఇలా గౌరీ పూజ చెయ్యమని చెప్పి ’ ఆశీర్వదించింది . ఆమె అలాగే  ఆచరించింది  .

చిత్రంగా ఆ అయిదు కుప్పలు వరుసగా పసుపు, కుంకుమ , కొబ్బరి ,బెల్లము, జీలకర్ర గా మారిపోయాయి. అప్పుడు  గౌరీదేవి మాఘగౌరీదేవి నోము విధానమును వివరించి చెప్పింది. విధి విధానం తెలిసికొని బాల వితంతువు మాఘ గౌరీ నోము నోచింది .ఆ నోము ఫలంగా మరణించిన తన భర్త బ్రతికి బయట పడ్డాడు.

వ్రత విధానం :
ఈ వ్రతాన్ని మాఘ మాసంలో ఆచరించాలి . నెలంతా , రోజూ  నదీ తీరానికి వెళ్ళి బియ్యపు పిండి , పసుపు, కుంకుమలతో, ఐదేసి పద్మములు పెట్టవలెను .అక్కడ పసుపుతో గౌరీ దేవి ని ప్రతిష్టించి, అష్టోత్తర శతనామాలతో పూజించాలి . పూజానంతరం పసుపు గౌరమ్మని  నీటిలో కలుపుకోవాలి . మొదటి సంవత్సరం పసుపు, రెండవ సంవత్సరం కుంకుమ, మూడవ సంవత్సరం కొబ్బరి , నాలుగవ సంవత్సరం బెల్లం, అయిదవ సంవత్సరం జీలకర్ర అయిదుగురు ముత్తయిదువులకు  వాయన మియ్యాలి . 

కధ చెప్పుకొని అక్షింతలు, శిరస్సున ధరించాలి . భక్తిశ్రద్ధ లతో  నోము నోచిన ఫలం సిద్దించ గలదు.

గౌరీ అష్టోత్తరం :

ఓం గౌర్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం గుహాంబికాయై నమః
ఓం జగన్నేత్రే నమః
ఓం గిరితనూభవాయై నమః
ఓం వీరభధ్రప్రసవే నమః
ఓం విశ్వవ్యాపిణ్యై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః 10
ఓం శివాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం హెమవత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం మాంగల్యధాయిన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః 20
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం సత్యై నమః
ఓం సర్వమయై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం కామకలనాయై నమః
ఓం కాంక్షితార్ధప్రదాయై నమః 30
ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః
ఓం చిదంబరశరీరిణ్యై నమః
ఓం శ్రీ చక్రవాసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కామేశ్వరపత్న్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నరాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం అంబికాయై నమః 40
ఓం హిమాద్రిజాయై నమః
ఓం వేదాంతలక్షణాయై నమః
ఓం కర్మబ్రహ్మామయై నమః
ఓం గంగాధరకుటుంబిన్యై నమః
ఓం మృడాయై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం కన్యకాయై నమః 50
ఓం దుర్గాయై నమః
ఓం కలిదోషవిఘ్నాతిన్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం కృపాపూర్ణాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం అచింత్యాయై నమః 60
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాంబికాయై నమః
ఓం పురుషార్ధప్రదాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం సర్వరక్షిణ్యై నమః
ఓం శశాంకరూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయ్యై నమః
ఓం స్వధాయై నమః 70
ఓం ప్రత్యంగిరాంబికాయైనమః
ఓం ఆర్యాయై నమః
ఓం దాక్షాయిణ్యై నమః
ఓం దీక్షాయై నమః
ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః
ఓం శివాభినామధేయాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
ఓం హ్రీంకార్త్యె నమః
ఓం నాదరూపాయై నమః 80
ఓం సుందర్యై నమః
ఓం షోడాశాక్షరదీపికాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం చండ్యై నమః
ఓం భగమాళిన్యై నమః
ఓం భగళాయై నమః
ఓం మాతృకాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం అమలాయై నమః 90
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
ఓం అంబాయై నమః
ఓం భానుకోటిసముద్యతాయై నమః
ఓం వరాయై నమః
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం సర్వకాలసుమంగళ్యై నమః
ఓం సోమశేఖర్యై నమః
ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః
ఓం బాలారాధిత భూతిదాయై నమః 100
ఓం హిరణ్యాయై నమః
ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం మార్కండేయవర ప్రదాయై నమః
ఓం అమరసంసేవ్యాయై నమః
ఓం అమరైశ్వర్యై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం భద్రదాయిన్యై నమః 108

ఇతి శ్రీ గౌరీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Quote of the day

Love is an endless mystery, for it has nothing else to explain it.…

__________Rabindranath Tagore