Online Puja Services

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి (పూజ)

3.144.252.58

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి (పూజ)

శ్రీ వేంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ వేంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మి
చతుర్వింశతి నామభి: శ్రీ వెంకటేశ మహిషీ మహా లక్ష్మి అర్చన కరిష్యే

అస్య శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టప్ చంధం!
శ్రీ మహాలక్ష్మీ దేవతాః శ్రీ వెంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్ధే జపే వినియోగః

ధ్యానం

ఈశానం జగతో స్య వెంకట పతే ర్విష్టో: పరాం ప్రేయసీం
తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్ కాంతి సంవర్ధినీమ్
పద్మాలంకృతపాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం

లక్ష్మీ చతుర్వింశతి(24) నామాలు

1) శ్రీ శ్రీయై నమః
2) శ్రీ లోక ధాత్రై నమః
3) శ్రీ బ్రహ్మమాత్రే నమః
4) శ్రీ పద్మనేత్రాయై నమః
5) శ్రీ పద్మముఖ్యై నమః
6) శ్రీ ప్రసన్నముఖ పద్మాయై నమః
7) శ్రీ పద్మకాంత్యై నమః
8) శ్రీ బిల్వ వనస్థాయై నమః
9) శ్రీ విష్ణుపత్న్యై నమః  
10) శ్రీ విచిత్ర క్షేమ ధారిణ్యై నమః
11) శ్రీ పృధుస్రోణ్యై నమః
12) శ్రీ పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమః
13) శ్రీ సురక్త పద్మ పత్రాభ కరపాద తలాయైనమః 
14 శ్రీ శుభాయై నమః
15) శ్రీ సురత్నాంగద కేయూర కాంబీ నూపుర శోభితాయై నమః
16) శ్రీయక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః 
17) శ్రీ కటకోజ్వలాయైనమః 
18) శ్రీ మాంగళ్యా భరణై శ్చిత్రైః ముక్తా హారైర్వి భూషితాయై నమః
19) శ్రీ తాటంకై రవతంపై శృ శోభమాన ముఖాంబుజాయైనమః 
20) శ్రీ పద్మహస్తాయై నమః
21) శ్రీ హరివల్లభాయై నమః
22) శ్రీ బుగ్యజుస్సామ రూపాయై నమః
23) శ్రీ విద్యాయై నమః 
24) శ్రీ అభిజాయై నమః

ఓం ఏవం చతుర్వింశతి నామభి: బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతు

ఈ 24 నామాలతో లక్ష్మీ దేవికి బిల్వ దళాలతో అర్చన చేస్తే సర్వ అభీష్టాలు నెరవేరుతుంది అని ఈ శ్లోకం యొక్క ఫలస్తుతి లోనే ఉంది . నష్టద్రవ్య ప్రాప్తికి, పూర్వ వైభవానికి బిల్వ దళాలతో ఈ పూజ మండల దీక్ష వ్రతంలా చేస్తారు.. 

మహాలక్ష్మీ నమోస్తుతే

బిల్వ దళాలు దొరలేదు అనుకునే వాళ్ళు మనసులోనే ఒక్కో నామాన్ని స్మరిస్తూ బిల్వదళం సమర్పిస్తున్నట్టుగా మానసిక పూజ చేసుకోండి..కానీ ఈ పూజ మండల దీక్ష చేయాలి అనుకునే వాళ్ళు 24 నామాలకు 24 బిల్వదళాలు ఉపయోగించాలి..

- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda