శ్రీ సరస్వతీ దేవి పూజావిధి
శ్రీ సరస్వతీ దేవి పూజావిధి :
శ్రీరస్తు | శ్రీగురుభ్యోనమః | శ్రీసరస్వతీపూజా |
ఆచమనం కృత్వా ; (ఆచమనం చేయాలి )
1. కేశవాయ నమః
2. నారాయణాయ నమః
3. మాధవాయ నమః
4. గోవిందాయ నమః
5. విష్ణవే నమః
6. మధుసూదనాయ నమః
7. త్రివిక్రమాయ నమః
8. వామనాయ నమః
9. శ్రీధరాయ నమః
10. హృషీకేశాయ నమః
11. పద్మనాభాయ నమః
12. దామోదరాయ నమః
13. సంకర్షణాయ నమః
14. వాసుదేవాయ నమః
15. ప్రద్యుమ్నాయ నమః
16. అనిరుద్ధాయ నమః
17. పురుషోత్తమాయ నమః
18. అధోక్షజాయ నమః
19. నారసింహాయ నమః
20. అచ్యుతాయ నమః
21. జనార్ధనాయ నమః
22. ఉపేంద్రాయ నమః
23. హరయే నమః
24. శ్రీ కృష్ణాయ నమః
అని నామావళి పఠించుచు విష్ణువును స్మరించవలెను.
మంగళోచ్చారణం
1. శ్రీ మన్మహాగణాధిపతయే నమః
2. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
3. శ్రీ వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
4. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః
5. శచీ పురన్దరాభ్యాం నమః
6. కుల దేవతాభ్యో నమః
7. మాతాపితృభ్యాం నమః
8. పతిచరణారవిందాభ్యాం నమః
9. సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ నమః
నిర్విఘ్నమస్తు
పుణ్యాహం దీర్ఘ మాయురస్తు
(అని స్మరించవలయును)
శ్లో|| సర్వేష్వారంభకార్యేషుత్రయస్త్రిభువనేశ్వరాః|
దేవాదిశంతునస్సిద్ధింబ్రహ్మేశానజనార్దనాః||
విష్ణుర్విష్ణుర్విష్ణుః(అని విష్ణువును స్మరించి)
ప్రాణాయామము
ఎడమ ముక్కరమును మూసి, కుడిముక్కరముతో ‘యం’ అను వాయు బీజమును ౪ మాఱ్లు స్మరించుచు వాయువును లోనికి పీల్చి; వాయువును కుంభించి ‘రం’ అను అగ్ని బీజమును ౧౬ మాఱ్లు మానసికముగ పఠించి; ‘యం’ అను వాయు బీజమును ౮ మాఱ్లు మానసికముగ పఠింపుచు ఎడమ ముక్కరముతో వాయువును విడువవలయును.
సంకల్పః
1. దేశసంకీర్తనము:- పంచాశత్కోటి యోజన విస్తీర్ణ మహీ మండలే, లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య (ఆగ్నేయ, …) ప్రదేశే, కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే (గంగా కావేర్యోర్మధ్యదేశే, …), స్వగృహే (బంధుగృహే, వసతిగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరగురుచరణ సన్నిధౌ||
2. కాలసంకీర్తనము:- శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన …. సంవత్సరే, ఉత్తరాయణే(దక్షిణాయనే), ….ఋతౌ, ….మాసే, ….పక్షే, …..తిథౌ, …..వాసరే, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే.
3. సంకల్పం:–ఏవం గుణవిశేషణ విశిష్టాయామ్ అస్యాం శుభతిథౌ శ్రీమాన్/ శ్రీమతీ …. గోత్రః/గోత్రవతీ …. నామధేయః/నామధేయవతీ మమ (అస్మాకం) ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సకలవిద్యాపారంగతత్త్వసిద్ధ్యర్థం చ వర్షే వర్షే ప్రయుక్తాం శ్రీసరస్వతీదేవతాం ఉద్దిశ్య సరస్వతీదేవతా ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే||
(అని సంకల్పించి, కలశపూజాదులను జేయవలెను)
కలశపూజా
తదంగ కలశారాధనం కరిష్యే|| (అని సంకల్పించి)
సోదకం కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య||
ఒక కంచుపాత్రను గాని వెండి పాత్రను గాని అడుగున ఒక ఆకుగాని, పళ్లెముగాని ఆధారమునుంచి పెట్టి, అలంకరించి, అందు జలము పోసి, గంధ పుష్పాక్షతలను అందుంచి, కలశముపై కుడి హస్తము నుంచి, ఈ క్రింది మంత్రములను పఠించవలెను.
శ్లో|| కలశస్యముఖేవిష్ణుఃకంఠేరుద్రస్సమాశ్రితః|
మూలేతత్రస్థితోబ్రహ్మామధ్యేమాతృగణాస్స్మృతాః||
శ్లో|| కుక్షౌతుసాగరాస్సర్వేసప్తద్వీపావసుంధరా|
ఋగ్వేదోఽథయజుర్వేదస్సామవేదోహ్యథర్వణః||
అంగైశ్చసహితాస్సర్వేకలశాంబుసమాశ్రితాః||
శ్లో|| గంగేచ ! యమునే! కృష్ణే! గోదావరి! సరస్వతి!|
నర్మదే! సింధుకావేర్యౌ ! జలేఽస్మిన్సన్నిధింకురు ||
ఆయాంతుశ్రీసరస్వతీపూజార్థం మమదురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవీమాత్మానం చ సంప్రోక్ష్య||
(కలశోదకమును, అందలి పుష్పముతో దేవీ ప్రతిమ మీదను, తన శిరస్సునను, పూజాద్రవ్యముల పైనను చల్లుకొనవలెను)
ప్రాణప్రతిష్ఠా
(కుడి హస్తములో పుష్పముంచుకుని దేవతా ప్రతిమ పై (/ పుస్తకముపై గాని) నుంచి ఈ క్రింది మంత్రమును పఠించునది.)
” ఆంహ్రీంక్రోంయంరంలంవంశంషంసంహంళంక్షం, హంసః శ్రీసరస్వతీ దేవతా స్థిరాభవతు , సుప్రసన్నాభవతు , వరదాభవతు “|
దీపారాధనమ్
ఘృతాక్త వర్తిభిర్దీపం ప్రజ్వాల్య ధ్యాయేత్|
నేతిని పోసి దీపము వెలిగించి దీప స్తంభము నలంకరించి, ఈ క్రింద మంత్రముతో ధ్యానించుము. పూజించుము.
శ్లో॥దీపస్త్వంబ్రహ్మరూపోఽసిజ్యోతిషాంప్రభురవ్యయః|సౌభాగ్యందేహిపుత్రాంశ్చసర్వాన్కామాంశ్చదేహిమే॥
దీప దేవతాభ్యోనమః , సకల పూజా పరిపూర్ణార్థం గంధాక్షత పుష్పాణి సమర్పయామి.
సరస్వతీ పూజా ప్రారంభము
ధ్యానం:-
శ్లో|| పుస్తకేషు యతో దేవీ క్రీడతేపరమార్థతః |
తతస్తత్రప్రకుర్వీత ధ్యానమావాహనాదికమ్ ||
శ్లో|| ధ్యానమేవం ప్రకుర్వీత సాధకో విజితేన్ద్రియః|
ప్రణవాసనమారూఢాం తదర్థత్వేన నిశ్చితామ్||
శ్లో||అంకుశం చాక్షసూత్రంచ పాశం వీణాంచ ధారిణీం |
ముక్తాహారసమాయుక్తామ్ మోదరూపాం మనోహరామ్||
శ్లో||కృతేన దర్పణాభేన వస్త్రేణోపరి భూషితాం |
సుస్తనీంవేదవేద్యాం చ చన్ద్రార్ధకృతశేఖరామ్||
శ్లో||జటాకలాపసంయుక్తాం పూర్ణచన్ద్రనిభాననాం|
త్రిలోచనాం మహాదేవీం స్వర్ణనూపురధారిణీమ్||
శ్లో|| కటకైః స్వర్ణరత్నాదైర్ముక్తావలయభూషితామ్ |
కమ్బుకణ్ఠీం సూతామ్రోష్ఠీం సర్వాభరణభూషితాం ||
శ్లో|| కేయూరైర్మేఖలాద్యైశ్చ ద్యోతయన్తీం జగత్రయం |
శబ్దబ్రహ్మాత్మికాం దేవీం ధ్యానకర్మసమాహితః ||
సరస్వత్యై నమః ధ్యాయామి.
ఆవాహనమ్:-
శ్లో|| అత్రాగచ్ఛ జగద్వన్ద్య సర్వలోకైకపూజితే|
మయా కృతామిమాం పూజాం గృహాణ జగదీశ్వరి||
సరస్వతీం ఆవాహయామి|(ప్రతిమపై అక్షతలనుంచుము)
ఆసనం:-
శ్లో|| అనేకరత్నసంయుక్తం సువర్ణేన విరాజితం|
ముక్తామణ్యంచితం చారు చాసనం తేదదామ్యహమ్||
సరస్వత్యై ఆసనమ్ సమర్పయామి|(అక్షతలతో)
పాద్యం:-
శ్లో|| గన్ధపుష్పాక్షతైః సార్ధం శుద్ధతోయేన సంయుతం|
శుద్ధస్ఫటికతుల్యాంగి పాద్యం తే ప్రతిగృహ్యతాం||
సరస్వత్యై పాద్యం సమర్పయామి| (కలశోదకం)
అర్ఘ్యమ్:-
శ్లో||భక్తాభీష్టప్రదే దేవి దేవదేవాదివన్దితే|
ధాతృప్రియే జగద్ధాత్రి దదామ్యర్ఘ్యం గృహాణ మే ||
సరస్వత్యై అర్ఘ్యం సమర్పయామి|(కలశోదకం)
ఆచమనీయం:-
శ్లో|| పూర్ణచన్ద్రసమానభే కోటిసూర్యసమప్రభే|
భక్త్యా సమర్పితం వాణి గృహాణాచమనీయకమ్||
సరస్వత్యై ఆచమనీయం సమర్పయామి. (కలశోదకం)
మధుపర్కః:-
(మధుపర్కమనగా ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె మిశ్రితము)
శ్లో||కమలభువనజాయే కోటిసూర్యప్రకాశే,
విశదశుచివిలాసే కోమలే హారయుక్తే|
దధిమధుఘృతయుక్తం క్షీరరంభాఫలాఢ్యం,
సురుచిరమధుపర్కం గృహ్యతాం దేవవన్ద్యే ||
సరస్వత్యై మధుపర్కం సమర్పయామి. ( లేదా అక్షతాన్ సమర్పయామి)
మధుపర్కానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకంతో)
పంచామృత స్నానం:-
(పంచామృతములు – ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, శర్కర మిశ్రితము)
శ్లో|| దధిక్షీరఘృతోపేతం శర్కరామధు సంయుతమ్|
పంచామృత స్నానమిదం స్వీకురుష్వ మహేశ్వరి!
సరస్వత్యై పంచామృతస్నానం సమర్పయామి. ( /తదర్థం శుద్ధోదక స్నానం సమర్పయామి)
స్నానం:-
శ్లో|| శుద్ధోదకైశ్చ సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం|
సువర్ణకలశానీతైర్నాగన్ధసువాసితైః||
సరస్వత్యై శుద్ధోదక స్నానం సమర్పయామి. (కలశోదకంతో)
వస్త్రం:-
శ్లో|| శుక్లవస్త్రద్వయం దేవి కోమలం కుటిలాలకే |
మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణి ప్రతిగృహ్యతామ్||
సరస్వత్యై వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం:-
శ్లో||శబ్దబ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే |
బ్రహ్మసూత్రం గృహాణ త్వం బ్రహ్మశక్రాదిపూజితే||
సరస్వత్యై యజ్ఞోపవీతం సమర్పయామి.
ఆభరణాని:-
శ్లో|| కటకముకుటహారైర్నూపురైరంగదాధ్యై
ర్విధసుమణియుక్తైర్మేఖలారత్నహారైః|
కమలదళవిలాసే కామదే సంగృహీష్వ
ప్రకటితకరుణార్ద్రే భూరిశో భూషణాని||
సరస్వత్యై భూషణాని సమర్పయామి.
గంధః:-
శ్లో|| చన్దనాగరుకస్తూరీకర్పూరాద్యైశ్చ సంయుతం
గన్ధం గృహాణ తం దేవి విధిపత్ని నమోఽస్తుతే||
సరస్వత్యై గంధం సమర్పయామి.
అక్షతాః:-
శ్లో||అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయతండులనిర్మితాన్|
గృహాణ వరదే దేవి బ్రహ్మపత్ని శుభాత్మకాన్||
సరస్వత్యై అక్షతాన్ సమర్పయామి.
పుష్పాణి:-
శ్లో|| నన్ద్యావర్తాదిపుష్పైశ్చ మల్లికాభిర్మనోహరైః,
కరవీరైర్మనోరమ్యైర్వకుళైః కేతకైః శుభైః,
పున్నాగైర్జాతికుసుమైర్మన్దారైశ్చ సుశోభితైః,
నీలోత్పలైః శుభైశ్చాన్యైస్తత్కాలతరుసమ్భవైః
కల్పితాని చ మాల్యాని గృహాణామరవన్దితే||
సరస్వతీం పుష్పైః పూజయామి.
అథాఽంగపూజా
బ్రహ్మణ్యై నమః| పాదౌ పూజయామి|
బ్రహ్మణ్యమూర్తయే నమః| గుల్ఫౌ పూజయామి|
జగత్స్వరూపిణ్యై నమః| జంఘే పూజయామి|
జగదాద్యాయై నమః| జానునీ పూజయామి|
చారువిలాసిన్యై నమః | ఊరూ పూజయామి|
కమలభూమయే నమః| కటిం పూజయామి|
జన్మహీనాయై నమః| జఘనం పూజయామి|
గంభీరనాభయే నమః| నాభిం పూజయామి|
హరిపూజ్యాయై నమః| ఉదరం పూజయామి|
లోకమాత్రే నమః| స్తనౌ పూజయామి|
విశాలవక్షసే నమః| వక్షస్థలం పూజయామి|
గానవిచక్షణాయై నమః| కంఠం పూజయామి|
స్కంధప్రపూజ్యాయై నమః| స్కంధౌ పూజయామి|
ఘనబాహవే నమః | బాహూ పూజయామి|
పుస్తకధారిణ్యై నమః | హస్తౌ పూజయామి|
శ్రోత్రియబన్ధవే నమః | శ్రోత్రే పూజయామి|
వేదస్వరూపాయై నమః| వక్త్రం పూజయామి|
సునాసాయై నమః| నాసికాం పూజయామి|
బింబోష్ఠ్యై నమః | ఓష్ఠౌ పూజయామి|
కమలచక్షుషే నమః | నేత్రే పూజయామి|
తిలకధారిణ్యై నమః | ఫాలం పూజయామి|
చన్ద్రమూర్తయే నమః | చికురాన్ పూజయామి|
సర్వప్రదాయై నమః | ముఖం పూజయామి|
మహాసరస్వత్యై నమః | శిరః పూజయామి|
బ్రహ్మరూపిణ్యై నమః | సర్వాణ్యంగాని పూజయామి|
అథఅష్టోత్తరశతనామపూజా||
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకహస్తాయై నమః
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం పీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకారభూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం వింధ్యాచలవిరాజితాయై నమః
ఓం చండికాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం సుధామూర్తయే నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం శుమ్భాసురప్రమథిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం ముండకాయప్రహరణాయై నమః
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసురనమస్కృతాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధరసుపూజితాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
ఓం చతురాననసామ్రాజ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం రక్తమధ్యాయై నమః
ఓం నీలజంఘాయై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః
శ్రీ సరస్వత్యై నమః నానావిధపరిమళపత్రపుష్పాక్షతైః అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి |
ధూపం:-
శ్లో||దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరమ్|
ధూపం గృహాణ కల్యాణి భక్తిం త్వయ్యచలాం కురు||
సరస్వత్యై ధూపమాఘ్రాపయామి.
దీపం:-
శ్లో|| ఘృతాక్తవర్తిత్రితయై ర్దీపితం దీపమమ్బికే|
గృహాణ చిత్స్వరూపే త్వం కమలాసనవల్లభే||
సరస్వత్యై దీపమ్ దర్శయామి.
ధూపదీపానన్తరం శుద్ధాచమనీయం సమర్పయామి.
నైవేద్యం:-
(పదార్థ పాత్రలను శుద్ధ ప్రదేశమున నుంచి అభిఘరించి తానుపదేశము పొందిన మూలమంత్రముతో పదార్థములపై జలముచల్లి, దేవికి ఆచమనీయము నిచ్చి)
శ్లో|| అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాచితాన్|
మృదుళాన్ గుడసమ్మిశ్రాన్ సజీరకమరీచికాన్||
కదళీపనసామ్రం చ సుపక్వాని ఫలాని చ|
కన్దమూలం వ్యంజనాది సొపదంశం మనోహరమ్||
అన్న చతుర్విధోపేతం క్షీరాన్నం సఘృతం దధి|
శీతోదకం చ సుస్వాదు కర్పూరైలాదివాసితమ్||
భక్ష్యభోజ్యసమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్||
సరస్వత్యై మహానైవేద్యం సమర్పయామి.
ప్రాణాయ నమః| అపానాయ నమః| వ్యానాయ నమః| ఉదానాయ నమః| సమానాయ నమః|| ఇతి నైవేద్యం సమర్ప్య –
నైవేద్యానన్తరం ఉత్తరాపోశనం సమర్పయామి|
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి|
శుద్ధాచమనీయం సమర్పయామి|
తాంబూలం:-
శ్లో|| తాంబూలమ్ చ సకర్పూరం పూగనాగదళైర్యుతం|
గృహాణ దేవదేవేశి తత్త్వరూప నమోఽస్తుతే||
సరస్వత్యై తాంబూలం సువర్ణపుష్పం చ సమర్పయామి.
నీరాజనం:-
శ్లో|| నీరాజనం గృహాణ త్వం జగదానన్దదాయిని|
జగత్తిమిరమార్తాండమండలే తే నమోనమః ||
సరస్వత్యై నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం:-
శ్లో|| శారదే లోకమాతస్త్వమాశ్రితాభీష్టదాయిని|
పుష్పాంజలిం గృహాణ త్వం మయా భక్త్యా సమర్పితమ్||
శ్లో||యా కుందేందుతుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా|
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా||
సరస్వత్యై మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మప్రదక్షిణ నమస్కారాః:-
శ్లో|| పాహి పాహి జగద్వన్ద్యే నమస్తే భక్తవత్సలే|
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః||
శ్లో|| పాశాంకుశధరా వాణీ వీణాపుస్తకధారిణీ|
మమ వక్త్రే వసేన్నిత్యం దుగ్ధకున్దేన్దునిర్మలా||
చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ|
చతుర్దశసు లోకేషు సా మే వాచి వసేచ్చిరమ్||
సరస్వత్యై చతుర్దశ (14) ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి||
ప్రార్థనా:-
శ్లో|| లడ్డుకాన్ ఘృతసంయుక్తాన్ చతుర్దశ మనోహరాన్|
సదక్షిణం సతాంబూల ముత్తమాయ ద్విజాతయే||
సరస్వతి నమస్తుభ్యం వరదే భక్తవత్సలే|
ఉపాయనం ప్రదాస్యామి విద్యావృద్ధిం కురుష్వ మే||
భారతీ ప్రతిగృహ్ణాతు భారతీ వై దదాతి చ|
భారతీ తారకోభాభ్యాం భారత్యైతే నమో నమః ||
ఇతి సంప్రార్థ్య
శ్లో||యస్యస్మృత్యాచనామోక్త్యా తపఃపూజాక్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే సరస్వతి !||
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సరస్వతి!|
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే || ( అని పఠించి, అక్షతలు, జలము చేతగొని)
అనయా కల్పోక్తప్రకారేణ మయా కృతయా షోడశోపచార పూజయా భగవతీ సర్వదేవాత్మికా శ్రీ మహాసరస్వతీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు||(అని జలాక్షతలను వదిలిపెట్టవలెను)
పూజావిధి సంపూర్ణం
#saraswathipooja #saraswatipoojavidhanam
Tags: saraswathi, saraswati, pooja, puja, vidhi, vidhanam