Online Puja Services

సర్వ కార్య సిద్ది వారాహి వ్రతం

18.222.98.29

సర్వ కార్య సిద్ది వారాహి వ్రతం

వారాహి మాత పూజకు మొదట పూజకు అమ్మవారి పటం, లేకపోతే అమ్మ వారిని ఆవాహన చేస్తూ కలశం అయిన పెట్టవచ్చు,అది కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయిన అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను,అని మనసులో అనుకోని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టవచ్చు.

ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం, విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు.

కానీ ప్రతి నెల 2 సార్లు వచ్చే పంచమి తిధిని మాత్రం మిస్ అవ్వకుండా  వారాహి మాత పూజని గుండ్రంగా ఉండే 5 లడ్డులను నైవేద్యంగా సమర్పించీ,దీపారాధన చేయాలి, అలాగే ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంతవరకు,సాయంకాలం 6 గo పైన మొదలు పెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు, ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు, మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు.

ఈమెకు పగటి పూజకంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతోంది. కనుక మన గ్రూపులో వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్లు అందరూ ఇప్పుడు వచ్చే పంచమి తిథి నుంచి 16 శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి  సమస్యలు ఈ చిన్న పూజ వల్ల దాదాపు పరిష్కరించుకోవచ్చు.

పూజకు కావాల్సిన సామగ్రి

1.పసుపు
2.కుంకుమ
3.ఆగర్భత్తులు
4.దానిమ్మ పండు గింజలు
5.లడ్డులు(5)
6.అమ్మ వారి చిత్రపటం,విగ్రహం,కలశం, ఇవేవీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి, అ దీపకాంతిని వారాహిమాత  గా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు.
7. (పువ్వులు) ఖచ్చితంగా పలనా పువ్వులు పెట్టాలని రూల్ ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు, అలాగే అమ్మవారినీ,భూదేవి అని అంటారు, కనుక ఈ భూమిమీద ఏ పువ్వు అయిన రోడ్డు పక్కన మన పెరటిలో వికసించిన ఏ పుష్పం అయిన అమ్మకు ఇష్టం, పూలకోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

దానిమ్మ గింజాలు ఒక గుప్పెడు,లడ్డులు 5 గుండ్రంగా ఉండాలి

వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకొనే వారికి నా విన్నపం.  దయచేసి మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకొని చేసే పూజ ఎప్పటికి ఫలితాన్ని ఇవ్వదు, మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకొనే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచన తో పూజ చేయాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలు అయినది అని దాని అర్థం, మీరు యూట్యూబ్ లో మరియు ఇతరత్రా సోషల్ మీడియాలలో చూస్తున్నా వార్తలను నమ్మి మోసపోకండి, ఈ పూజ కేవలం 4 అంశాలను పరిగణనలోకి తీసుకొని చేయిస్తున్నాను

1.ఆర్ధిక ఇబ్బంది
2.వ్యాపార అభివృద్ధి
3.ఇంట్లో తరచు కలహాలు
4.మానసిక ప్రశాంతత

కేవలం ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుని పూజ చేయమంటూతున్నాను,ఈ విషయం అందరూ గమనించగలరు.

ఓం నమో వారాహి

మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు,వీరే బ్రహ్మీ,మాహేశ్వరి,కౌమారి,వైష్ణవి, వారాహి,ఇంద్రాణి,చాముండీ.
8.వ మాతృక గా నారసింహి
9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించపడుతోంది, ఈ వారాహిరూపం పంది రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేగవర్ణంతో 8 చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముక్యంగా లలితదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచినవారికి,భక్తుల పాలిట   కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞాన సిద్ధిబుద్ధి,ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే  ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.

ప్రతినిత్యం మీరు ఈ నామాలను స్మరిచండి....

ఓం పంచమే నమః
ఓం దండనాథ నమః
ఓం సంకేత నమః
ఓం సమయేశ్వరి నమః
ఓం సమయ సంకేత నమః
ఓం పోత్రిన్యే నమః
ఓం శివయే నమః
ఓం ఆజ్ఞ చక్రేశ్వరి నమః
ఓం మహా సైన్యయే నమః
ఓం వార్తాలీ నమః

ఈ నామాలతో స్మరిస్తే సకల కార్య సిద్ధి లభిస్తుంది.

॥ వారాహీ గాయత్రీ ॥
వరాహముఖ్యై విద్మహే । దణ్డనాథాయై ధీమహీ ।
తన్నో అర్ఘ్రి ప్రచోదయాత్

(వారాహి మాత ధ్యాన స్తోత్రం)
వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్
హారాగ్రైవేయతుంగస్తనభరనమితాం పీతకైశేయవస్త్రామ్ ।
దేవీం దక్షోధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలమ్
వామాభ్యాం ధారయన్తీం కువలయకలితాం శ్యామలాం సుప్రసన్నామ్

వారాహి అమ్మ వారి అవతారాలు

1.బృహత్ వారాహి
2.స్వప్న వారాహి
3.కిరాతా వారాహి
4.లఘు వారాహి
5.ధూమ్ర వారాహి
6.మహా వారాహి గా చెప్పబడుతున్నది.

1.బృహత్ వారాహి అనగా శత్రు శేషం ఉండదు అనగా మీరు ఈ అవతరాన్ని ఉపాసించడం వల్ల, మన లోని అంతర్ శత్రువులు కామ, క్రోధ, మద, మచర్యాలు,నశించి, మన అంతర్ ముకంగా ఉన్న శత్రువులను అమ్మ నశి oపచేస్తుంది,ఇది మన దక్షణాచారం లో అమ్మను కొలిచే పద్దతి.

2.స్వప్న వారాహి
ఈ స్వప్న వారాహి ని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత,భవిషత్, వర్థమానాలను తెలియచేస్తూ, సాధకులకు కానీ వారి కుటుంబసభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ, మంచి చెడులను ముందుగానే సాధకుల స్వప్నంలో కనిపించి,సమాధానం చెబుతుంది.
6.
మహా వారాహి భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది.

కిరాతా వారాహి, లఘు వారాహి,ధూమ్ర వారాహి అవతారాలు వాటి విశిష్టత మనకు ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన విధంగా 5 శుక్రవారాలు ఆ తల్లికి విశేషంగా పూజించుకోవచ్చు. 

శత్రు బాధ నివారణ, గ్రహాబాధ, అనారోగ్యంతో బాధ , పిల్లలే సమస్యగా మారిన తల్లి తండ్రులు చేయగలం ఈ విధంగా అని మీకు అనుకుంటే పైన చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని శుక్ల పక్షం లేదా కృష్ణ పక్షం లో వచ్చే పంచమి తిది రోజు పూజ మొదలు పెట్టి వారాహి ఉపాసన ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న విధంగా రోజు చేయాలి అనుకునే వారు ఈ మంత్రాన్ని జపం చేయడం మోదలు పెట్టాలి మీ శక్తి వంచన లేకుండా రోజూ 108 లేదా 5 సార్లు ఈ మంత్రాన్ని జపించి గుండ్రంగా ఉండే ఆహారం ముఖ్యంగా దానిమ్మపండు ,లడ్డు లాంటివి నివేదన చేసి 5 వారాలు జపం చేయాలి. మీ సంకల్పం నెరవేరుతుంది. అదే ఈ మంత్రం..

సర్వ బాధ నివారిణి అయిన బృహద్వారాహి మహా మంత్రం 

'అస్యశ్రీ బృహద్వారాహి మహామంత్రస్య బ్రహ్మ ఋషి , గాయత్రీచ్ఛందః శ్రీబృహద్వారాహి దేవతా | గ్లేo  బీజం | ఐం శక్తిః  ఠ : కీలకం!
ఐం, గ్లౌం, ఐం, నమో భగవతే వార్తాళీ 2 - వారాహి 2 || వరాహముఖి 2 || అంధే అంధినేనమః 11 రుంధే రుందినేనమః 111 ఓం జృంభినీ నమః న్యాసః 

( 2 ఉన్న చోట ఇంకో 2 సార్లు, 11 ఉన్న చోట అదే పదం 11 సార్లు, 111 సార్లు అన్న పదాన్ని 111 సార్లు పలకాలి)

ధ్యానం | రక్తాంబుజే ప్రేతవరాసనస్థా మర్ణోరు కామార్ఫటికా సనస్థాం | ద్రం షోల్ల సత్ప్రోత్రిముఖారవిందాం | కోటి రసంఛిన్న హిమాంశురేఖాం | హలం కపాలం ధధతీక రాభ్యాం , వామే కరాభ్యాం ముసలేష్ఠదేచ | రక్తాంబరాం రక్త పటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం | చ్యామాం సమస్తా భరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం || 

మనుః  (ఇక్కడ నుండి మూల మంత్రం ఇది మటుకే 108 సార్లు చేయాలి)

*ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతీ వార్తాళీ, వారాహి, వరాహముఖి, ఐం గ్లౌం ఐం అందె అంధినీ నమః | రుంధే రుంధినీ నమః | జంభే జంభినీనమః | మోహే మోహినే నమః | స్తంభే స్తంభినీ నమః | ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వ స్తంభనం కురు, శీఘ్రం వశ్యం కురు ఐం గ్లౌం ఐం ఠ : ఠ : ఠ : ఠ :  హుం ఫట్ స్వాహా||

నమో వారాహి

- భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi