ఐశ్వర్యాలని ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం
ఐశ్వర్యాలని ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం
- లక్ష్మి రమణ
హయగ్రీవుడు విద్యా స్వరూపుడు . విద్యలని అనుగ్రహించే విష్ణు స్వరూపుడు. హయగ్రీవ అనే నామాన్ని పలికితే చాలు, అటువంటి వారి పాపాలన్నీ తొలగి, దరిద్రం దూరమై పోతుంది . గంగాప్రవాహంలాగా చదువులు అబ్బుతాయి. హయగ్రీవ నామం నిరంతరం స్మరణ చేసేవారికి వైకుంఠ వాకిళ్ళు స్వాగతం పలుకుతాయి . ప్రతి బుధవారం, పౌర్ణమినాడు , విశేషించి హయగ్రీవ జయంతి అయిన శ్రావణ పౌర్ణమి నాడూ హయగ్రీవ స్తుతి చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు లభిస్తాయి. ఈ సమయాల్లో మీరు చదవడంతో పాటు ఈ శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రంను శ్లోకం పిల్లలు చదువుకునేలా వారికి నేర్పించండి . శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.
ఐశ్వర్యాలని ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం.
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ||1||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ .
తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్ ||2||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః |
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||3||
శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం |
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం . ||4||
ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచిత
హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||
ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః