Online Puja Services

శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం .

18.225.255.196

గ్రహాల అనుగ్రహాన్నిచ్చే  శ్రీ  ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం . 

ఆంజనేయుని ఆరాధనలో ఒక గొప్ప విశేషం దాగి ఉంది . అదేమంటే, ఆంజనేయుని ఆరాధించే సకల దేవతలనీ ఆరాధించిన ఫలం దక్కుతుంది. ఇది పరాశరసంహిత చెబుతున్నమాట . దేవీదేవతలు మాత్రమే కాదు, ఆంజనేయుని ఆరాదిస్తే, సర్వ గ్రహాల అనుకూలత కూడా  సిద్ధిస్తుంది . నవగ్రహాలకీ  ప్రతీకలుగా , వాటి దోష నివృత్తికి ఆయా గ్రహాలకి సంబంధించిన నవరత్నాలను ధరించమని చెబుతారు . రత్నాలను ఒకనాడు ఈ దేశంలో రాశులుగా పోసి అమ్మినమాట వాస్తవమే కానీ, ఈ రోజుల్లో వాటిని కొనడం అంత తేలికైన, చవకైన వ్యవహారమేమీ కాదు. అందుకే మీకోసం ఇక్కడ ఆ నవగ్రహాల అనుగ్రహాన్నిచ్చే శ్రీ  ఆంజనేయుని నవరత్న మాలా స్తోత్రాన్ని అందిస్తున్నాం. ఇది రోజూ చదువుకుంటే, గ్రహదోషాలు తొలగిపోతాయి .
 

శ్రీ  ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం . 

1) మాణిక్యం (సూర్యుడు)

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || ౧ ||

2) ముత్యం (చంద్రుడు)

యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || ౨ ||

3) ప్రవాలం (కుజుడు)

అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః || ౩ ||

4) మరకతం (బుధుడు)

నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || ౪ ||

5) పుష్యరాగం (గురుడు)

ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ || ౫ ||

6) హీరకం (శుక్రుడు)

రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || ౬ ||

7) ఇంద్రనీలం (శని)

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || ౭ ||

8) గోమేదికం (రాహువు)
 
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః || ౮ ||

9) వైడూర్యం (కేతువు)

నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ || ౯ ||

ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ |
 
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం

#anjaneyanavaratnamalastotram

Tags: Anjaneya Navaratnamala Stotram

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi