Online Puja Services

ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

3.139.235.177
ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!! మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి!
ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!
జయత్యతి బలో రామః
లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభి పాలితః !!

దాసోహం కౌసలేంద్రస్య
రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం
నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే
యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః
పాదపైశ్చ సహస్రశః !!

అర్ధయిత్వాం పురీం లంకాం
మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో
గమిష్యామి
మిషతాం సర్వ రక్షసాం !!

అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.
శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.
ఇది పఠించిన వారికి జయం తధ్యం !!
జయశ్రీ రామ!! శుభమ్ భూయాత్!!!!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi