ఆరోగ్య సమస్యలకి పరిష్కారం ఈ కాలభైరవ స్తోత్రం
శనిమహర్దశ , శనిదోషాలు, ఆరోగ్య సమస్యలకి పరిష్కారం ఈ కాలభైరవ స్తోత్రం .
- లక్ష్మి రమణ
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడు. కుక్క అంటే రక్షణకు, విశ్వసనీయతకు మారు పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేని వాడు.శాశ్వతుడు, నిత్యుడు. శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు, నీలాపనిందలు (తప్పు చేయకుండా, చేశారనే అభియోగాన్ని మోస్తున్న వారు ) పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు కాల భైరవుని శరణు వేడితే ఆ బాధల నుండీ ఉపశమనం పొందుతారు . శంకరాచార్యులు రాసినటువంటి కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజూ పూజా సమయంలో చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు. దీనివల్ల శత్రు బాధలు తొలుగుతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి . రోజూ చదవలేని వారు కనీసం ప్రతి సోమవారం ఖచ్చితంగా చదువుకోవడం మంచిది .
కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || ౯ ||
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |
#kalabhairavastakam #kalabhairavastotram
Tags: Kalabhairava, astakam, stotram