Online Puja Services

భర్త సంక్షేమంకోసం ఇల్లాలు పఠించాల్సిన శ్లోకం ఇదీ !

18.117.106.23

భర్త సంక్షేమంకోసం ఇల్లాలు పఠించాల్సిన శ్లోకం ఇదీ !
సేకరణ 

భర్తే దైవం, భర్తే సర్వస్వం అనుకున్నవారందరూ మహా పతివ్రతలుగా మనకి పురాణాల్లో దర్శనమిస్తారు . అలాంటి వారిలో యముణ్ణి వెంబడించి, భర్తప్రాణాలు దక్కించుకున్న సావిత్రి , సూర్యోదయాన్ని సైతం తన పాతివ్రత్య మహిమతో నిలిపి ఉంచిన సతీ సుమతి , తనని పరీక్షింపదలచి వచ్చిన త్రిమూర్తులనీ పసిబాలురిని చేసిన అనసూయ ప్రధమస్థానాల్లో నిలుస్తారు . మరి వారు ఏ పూజలు చేసి అంతటి మహత్యాన్ని పొందగలిగారు ? 

ఈ ప్రశ్నకి సమాధానం చెబుతుంది బ్రహ్మ వైవర్తన పురాణం . ఇందులో మనకి భర్త క్షేమంకోసం , ఆయన దీర్గాయువు కోసం  సావిత్రితో పాటు స్వయంగా లక్ష్మీ, సరస్వతి , పార్వతీదేవి, భూదేవి, గంగమ్మ పఠించిన స్తోత్రాన్ని ఇలా ఇచ్చారు . 

నమః కాంతాయా భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే 
నమః శాంతాయ దాంతాయా సర్వదేవాశ్రయాయ చ || 

నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయచ | 
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః || 

పంచప్రాణాధి దేవాయ చక్షుషస్తారకాయచ | 
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే || 

పతిర్బ్రహ్మ పతిర్విష్ణుః పతిరేవ మహేశ్వరః 
పతిశ్చనిర్గుణాదారో బ్రహ్మరూప నమోస్తుతే || 

క్షమస్వ భగవాన్ దోషం జ్ఞానాజ్ఞానకృతం చయత్| 
పత్నీ బందో  దయాసింధో దాసీ దోషం క్షమస్వమే || 

ఇతి స్తోత్రం మహాపుణ్యం సృష్ట్యాదౌ పద్మయాకృతం | 
సరస్వత్యాచ ధారయా గంగయా చ పురావ్రజ || 

సావిత్ర్యాచ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశ :
పార్వత్యాచ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ || 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya