భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్.
భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్.
విధానం
ఈ శ్లోకమ్ రాత్రి 10 నుండి 2 గ మధ్యలో చేస్తే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు..ముఖ్యంగా తగాదాలు, అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయం, అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహము తో పరిష్కరించబదుతుంది. అయితే ఈ తల్లి అనుగ్రహము కోసం ఈమెను రాత్రి పూట ఎక్కువగా ఆరాధించాలి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ప్రజల క్షేమం కోసం ఉద్యోగం చేస్తున్న సిబ్బంది అనారోగ్యం తో ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఆ వ్యాధి వల్ల కానీ ఇతర ప్రమాదాల వల్ల కానీ హాని కలగకుండా వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ వారాహి మాత శ్లోకాన్ని పఠిస్తే వారు సురక్షితంగా ఉంటారు.. ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగిస్తుంది..అకాల మృత్యువాత పడకుండా రక్షిస్తుంది.
ఇక్కడ ఇచ్చిన ఈ దత్త మంత్రం ముందుగా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి తర్వాత వారాహి మాత స్త్రోత్రం 3 సార్లు కానీ 16 సార్లు కానీ పారాయణ జపం చేయాలి..
దత్తాత్రేయ సర్వ బాధ నివారణ మంత్రం.
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే||"
భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్
అథ ధ్యానమ్ ।
వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం
హారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్ ।
దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలం
వామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం సుప్రసన్నామ్ ॥
నమోఽస్తు దేవి వారాహి జయైఙ్కారస్వరూపిణి ।
జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ॥ ౧॥
వారాహముఖి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః ।
సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తమ్భనకరే నమః ॥ ౨॥
నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః ।
రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవేశి మోహిని ॥ ౩॥
స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః ।
బాహ్వోః స్తమ్భకరీం వన్దే జిహ్వాస్తమ్భనకారిణీమ్ ॥ ౪॥
స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ ।
శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా ॥ ౫॥
ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే ।
హుమాత్మికే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే ॥ ౬॥
దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి ।
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ॥ ౭
ఇతి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్
లోకా సమస్తా సుఖినో భవంతు
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
శ్రీ మాత్రే నమః
- భానుమతి అక్కిశెట్టి