శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి స్తోత్రం ).
శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి స్తోత్రం ).
-సేకరణ
వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశి విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్టించారు. ఆ అమ్మవారిని స్థానికులు వారు వింధ్యేశ్వరిగా కొలుస్తారు. వింధ్యాచల ప్రాంతంలో దేవిని వామాచార విధానంలో ఆరాధించడమూ ఉన్నది. ఈ వింధ్యేశ్వరి స్తోత్రం ఎంతో ప్రభావవంతమైనది.
శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం.
నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం
వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం 1 ..
త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం
గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం 2 ..
దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్
వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3..
లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం
కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం 4..
కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్
వరం వరాననం శుభం భజామి వింధ్య వాసినీం 5..
ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం
జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం 6..
విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం
మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం 7..
పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్
విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం 8.
ఇతి శ్రీ వింధ్యేశ్వరి (వారాహి దేవి స్తోత్రం ) స్తోత్రం సంపూర్ణం .
అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం ఇది. ప్రతి రోజు పారాయణ చేస్తే అన్ని శుభాలను ప్రసాదిస్తుంది.
తరచూ అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఈ అష్టోత్తరం తో అర్చన చేస్తే మంచిది, ఈమె ఆయుష్షు ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది, ఈమె రథంలో ఎప్పుడూ ధన్వంతరి (వైద్యుడు), దేవా వైద్యులైన అశ్వినీ దేవతలూ ఉంటారు.
నమో వారాహి శరణం.
Vindhyeswari (Varahi Devi) Stotram