శ్రీ మంగళ చండికా స్తోత్రం
శ్రీ మంగళ చండికా స్తోత్రం .
మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయి.శత్రు పీడలు,ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టుసమస్యలు, సంసారంలోగొడవలు, అనారోగ్యసమస్యలు, కోపం,అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
సంహర్తి విపదాం రాశే దేవి మంగళ చండికే
హర్ష మంగళదక్షే చ హర్ష మంగళ చండికే
శుభే మంగళదక్షే చ శుభే మంగళ చండికే
మంగళే మంగళార్హే చ సర్వ మంగళ మంగళే
సతాం మంగళ దే దేవీ సర్వేషాం మంగళాలయేం
పూజ్యే మంగళవారే చ మంగళాబీష్ట దైవతే
పూజ్యే మంగళ భూపస్య మనువంశస్య సంతతం
మంగళాధిష్ట్టాతృ దేవీ మంగళానాం చ మంగళే
సంసారే మంగళాధారే మోక్ష మంగలదాయినీ
సారే చ మంగళా ధారే పారే త్వం సర్వకర్మణాo
ప్రతీ మంగళవారం చ పూజ్యే త్వం మంగళప్రదే
స్తోత్రేణానేన శంభుశ్చ స్తుత్వా మంగళ చండికాం
ప్రతీ మంగళవారే చ పూజాం కృత్వా గతః శివః
శుభం !!