Online Puja Services

పంచశ్లోకి గణేశ పురాణం .

18.119.167.189

భోగభాగ్యాలని అనుగ్రహించే పంచశ్లోకి గణేశ పురాణం . 
- లక్ష్మి రమణ 

గణపతి ఆరాధనకు మన సంప్రదాయంలో విశేషమైన ప్రాధాన్యత ఉన్న విషయం మనకి తెలిసినదే ! అయితే గణపతి ఆరాధనలో దాగిన ఎన్నో అంతరార్థాలు దాగున్నాయి . వాటిని గణేశ పురాణం, ముద్గల పురాణం మనకి తెలియజేస్తున్నాయి . కేవలం ఆ పురాణాన్ని ఐదు శ్లోకాలలో పొందుపరచి పంచశ్లోకిగా మనకి ఋషులు అందించారు . దానిని నిత్యమూ పారాయణ చేయగలిగితే,  అటువంటివారు సకల భోగభాగ్యాలతో తులతూగుతారని ఫలశృతి చెబుతోంది . 

పంచశ్లోకి గణేశ పురాణం 

శ్రీ విఘ్నేశపురాణసారముదితం వ్యాసాయ ధాత్రా పురా
తత్ఖండం ప్రథమం మహాగణపతేశ్చోపాసనాఖ్యం యథా |
సంహర్తుం త్రిపురం శివేన గణపస్యాదౌ కృతం పూజనం
కర్తుం సృష్టిమిమాం స్తుతః స విధినా వ్యాసేన బుద్ధ్యాప్తయే || ౧ ||

సంకష్ట్యాశ్చ వినాయకస్య చ మనోః స్థానస్య తీర్థస్య వై
దూర్వాణాం మహిమేతి భక్తిచరితం తత్పార్థివస్యార్చనమ్ |
తేభ్యో యైర్యదభీప్సితం గణపతిస్తత్తత్ప్రతుష్టో దదౌ
సర్వా న సమర్థ ఏవ కథితుం బ్రహ్మా కుతో మానవః || ౨ ||

క్రీడాకాండమథో వదే కృతయుగే శ్వేతచ్ఛవిః కాశ్యపః
సింహాంకః స వినాయకో దశభుజో భూత్వాథ కాశీం యయౌ |
హత్వా తత్ర నరాంతకం తదనుజం దేవాంతకం దానవం
త్రేతాయాం శివనందనో రసభుజో జాతో మయూరధ్వజః || ౩ ||

హత్వా తం కమలాసురం చ సగణం సింధుం మహాదైత్యపం
పశ్చాత్ సిద్ధిమతీసుతే కమలజస్తస్మై చ జ్ఞానం దదౌ |
ద్వాపారే తు గజాననో యుగభుజో గౌరీసుతః సిందురం
సమ్మర్ద్య స్వకరేణ తం నిజముఖే చాఖుధ్వజో లిప్తవాన్ || ౪ ||

గీతాయా ఉపదేశ ఏవ హి కృతో రాజ్ఞే వరేణ్యాయ వై
తుష్టాయాథ చ ధూమ్రకేతురభిధో విప్రః సధర్మర్ధికః |
అశ్వాంకో ద్విభుజో సితో గణపతిర్మ్లేచ్ఛాంతకః స్వర్ణదః
క్రీడాకాండమిదం గణస్య హరిణా ప్రోక్తం విధాత్రే పురా || ౫ ||

ఏతచ్ఛ్లోకసుపంచకం ప్రతిదినం భక్త్యా పఠేద్యః పుమాన్ |
నిర్వాణం పరమం వ్రజేత్స సకలాన్ భుక్త్వా సుభోగానపి ||

ఇతి పంచశ్లోకి గణేశ పురాణం |

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya