Online Puja Services

దేవర్షి నారదుడు ఉపదేశించిన సంకట నాశన గణేశ స్తోత్రం

3.145.19.123

దేవర్షి నారదుడు ఉపదేశించిన సంకట నాశన గణేశ స్తోత్రం

త్రిసంధ్యా కాలాలలో సంధ్యావందనం చేయడం మన ధర్మం.  సంధ్యావందనం చేయలేని వాళ్ళు కనీసం రోజుకి మూడుసార్లు కానీస సౌచాన్ని పాటించి (మధ్యాహ్న సమయంలో కాళ్ళూ, చేతులూ , ముఖం కడుక్కొని , శుచిగా కూర్చొని) చదువుకోవచ్చు . ఆఫీసుల్లో చదువుకున్నా , ఐదు నిమిషాలు పడుతుంది .  ఈ చిన్న స్తోత్రాన్ని రోజూ ఇలా త్రిసంధ్యల్లో చదువుకోవడం వలన వ్యాపారంలో సంకటాలు తొలగిపోతాయి. దానం లభిస్తుంది .  విద్యలో వెనుకబాటుతనం ఉండదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.  కుటుంబ కలహాలు సమసిపోతాయి.  ఎంత ప్రయత్నం చేసినా, బయటపడని ఆటంకాలు దూదిపింజల్లా తొలగిపోతాయి . నారద పురాణంలో దేవర్షి నారదుడు కామ్యాలని సిద్ధింపజేసే ఈ దివ్యమైన స్తోత్రాన్ని చెప్పారు . 

” సంకట నాశన గణేశ స్తోత్రం ” తప్పనిసరిగా కనీసం 3 సార్లు చేసుకోవాలి . విద్యార్థులు పుస్తకాలని స్వామి దగ్గర ఉంచి నమస్కరించుకోవాలి . భక్తితో ఒక బెల్లపు ముక్కను, గణేశునికి నైవేద్యం పెట్టండి. హారతి వెలిగించి  చూపించండి. ఇందాకే చెప్పుకున్నట్టు, సంకటాలన్నీ తొలగిపోతాయి. 

సంకట నాశన గణేశ స్తోత్రం:

నారద ఉవాచ 

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్‌ |
భక్తావాసం స్మరే న్నిత్యం యుః కామార్థసిద్ధయే ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్‌ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకమ్‌ ||

నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకమ్‌ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్‌ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్‌ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనమ్‌ |
పుత్రార్థీ లభతే పుత్రాన్‌ మోక్షార్థీ లభతే గతిమ్‌ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భి ర్మాసైః ఫలం లభేత్‌ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ||

అష్టభ్యో బ్రాహ్మణేభ్య శ్చ లిఖిత్వా యః సమర్పయేత్‌
తస్య విద్యా భవేత్‌ సర్వా గణేశస్య ప్రసాదతః ||

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రమ్‌ సంపూర్ణం.

ఓం గం గణపతయే నమః

#ganesha #ganeshasankatanasanastotram

Tags: ganesa, ganesha, sankata, nasana, stotram

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore