Online Puja Services

రోజూ ఈ గణేశ స్తోత్రం చేస్తే సరి !

18.225.195.153

విద్యా వికాసానికి , సర్వ కార్య సిద్ధికి, ధనం , పుత్ర లాభం కలగడానికి రోజూ ఈ  గణేశ స్తోత్రం చేస్తే సరి !
- లక్ష్మీరమణ 

నిత్యపూజయినా , ప్రత్యేక పూజా సందర్భమైనా  అది వినాయకుని పూజతోటే కదా ఆరంభం అవుతుంది . రోజూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం… అంటూ ఆ గణేశుని ప్రార్ధించిన తర్వాతే , మిగిలిన పూజా కార్యక్రమాలన్నీచేస్తుంటాం.  అయితే , రోజూ  మూడు పూటలా గణపతిని ఇక్కడ ఇచ్చిన స్తోత్రంతో పూజిస్తే, చదువు బాగా వస్తుంది. అన్ని కార్యాలలోనూ విజయం సిద్ధిస్తుంది . విఘ్నాలు తొలగిపోతాయి. పిల్లలు లేనివారయితే, సంతానవంతులవుతారు. దారిద్య్రం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అని చెబుతున్నారు పండితులు. గణేశుని 12 నామాలు ఉండే ఈ చిన్న స్తోత్రం మనం చదువుకోవచ్చు, పిల్లలకి కూడా తేలికగా నేర్పించవచ్చు.  ఆఫీసుల్లో ఉన్నా చక్కగా మొఖం కాళ్ళూ కడుక్కొని ఒక్క రెండు నిమిషాలు గణేశుని ఈ స్తోత్రం మూడుపూటలా చదువుకొని చూడండి. ఒత్తిడి తొలగి, మనఃశాంతి చేకూరడంతో పాటు కెరియర్లోనూ  చక్కని ఉన్నతి కలుగుతుంది.   

1.ప్రణమ్య శిరసా  దేవం  గౌరీ  పుత్రం  వినాయకమ్ !
భక్తావాసం  స్మరేన్నిత్యం  ఆయుష్కామార్థ  సిద్ధయే !!

2.ప్రథమం  వక్రతుండంచ  ఏకదంతం  ద్వితీయకమ్ !
తృతీయం  కృష్ణపింగాక్షం  గజవక్త్రం  చతుర్థకమ్ !!

3.లంబోదరం  పంచమంచ  షష్ఠం  వికటమేవ చ !
సప్తమం  విఘ్నరాజం చ  ధూమ్రవర్ణం  తథాష్టమమ్ !!

4.నవమం  ఫాలచంద్రం చ  దశమంతు  వినాయకమ్ !
ఏకాదశం  గణపతిం  ద్వాదశంతు  గజాననమ్ !!

5.ద్వాద శైతాని  నామాని  త్రిసంధ్యం  యః  పఠేన్నరః !
న చ విఘ్నభయం  తస్య  సర్వసిద్ధి  కరం  ప్రభో !!

6.విద్యార్థీ  లభతే  విద్యాం  ధనార్థీ  లభతే  ధనమ్ !
పుత్రార్థీ  లభతే  పుత్రాన్  మోక్షార్థీ  లభతే గతిమ్  !!

7.జపే ద్గణపతి  స్తోత్రం  షడ్భిః  మాసైః  ఫలం  లభేత్ !
సంవత్సరేణ  సిద్ధించ  లభతే  నాత్ర సంశయః !!

8.అష్టభ్యో  బ్రాహ్మణేభ్యశ్చః  లిఖిత్వా  యః  సమర్పయేత్ ! 
తస్య విద్యా భవే త్సర్వా గణేశస్య ప్రాసాదతః !!

కోరిన కోరికలన్నీ ఇచ్చే ఈ చిన్ని సిద్ధి గణపతి స్తోత్రాన్ని చదువుకొని, ఆయన అనుగ్రహన్ని పొందుదాం . మూడుపూటలా ఎక్కడ వున్నా పూర్ణ విశ్వాసంతో తమ ధర్మాన్ని ఆచరించే ఇతరులని చూసయినా మేలుకొండి .  అసలు ధర్మం అంటే ఇదీ అని తెలియజేసిన హిందూ ధర్మబంధువులారా, మన ధర్మాన్ని పాటించడానికి అంతే విశ్వాసంతో, నిబద్ధతతో ముందడుగు వేయండి . పూర్ణ విశ్వాసంతో ఆ గణాధిపతికి నమస్కారం చేసుకుందాం. 

శ్రీ గణేషానుగ్రహ సిద్ధిరస్తు! శుభం !!

#siddhiganapathistotram #stotram

Tags: siddhi, ganapathi, ganesa, ganesha, stotram, vinayaka,

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya