శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.
క్షయ, ఫిట్స్, కుష్ఠు వంటి భయంకరమైన రోగాలు కూడా నయం చేయగల శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.
- లక్ష్మి రమణ
సామాన్యులు కూడా చేసుకోగలిగిన మహామంత్రాలను పురాణాంతర్గతమైన స్తోత్రాలుగా అందించడం కేవలం మహానుభావుడైన ఆ వేదవ్యాసునికే చెల్లింది . సర్వపాపాలను నాశనం చేసే ఈ నృసింహుని 12 నామాలు ప్రతిరోజూ చేసుకోవచ్చు. అలా చేయడం వలన జ్వరాది బాధలు, వ్యాధులు తొలగిపోతాయి. ఈ దివ్య స్తోత్రాన్ని పఠించడం వలన కలిగే ఫలితం కూడా ఫలశృతిలో చక్కగా చెప్పారు . క్షయ, ఫిట్స్, కుష్ఠు వంటి భయంకరమైన రోగాలు కూడా భద్ర రాజం అని కూడా పిలిచే ఈ స్తోత్రాన్ని పఠించడం వలన తగ్గిపోతాయి. వందసార్లు పఠిస్తే వ్యాధి బంధనం తొలగిపోతుంది. 1000 మార్లు పఠిస్తే , వారిని వాంఛితఫలం వరిస్తుందని ఫలశృతి చెబుతుంది .
శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం
అస్య శ్రీనృసింహ ద్వాదశనామస్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః లక్ష్మీనృసింహో దేవతా శ్రీనృసింహ ప్రీత్యర్థే వినియోగః |
ధ్యానం |
స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్ |
నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహమ్ ||
స్తోత్రం |
ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ |
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || ౧ ||
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహన్తా చ అష్టమో దేవవల్లభః || ౨ ||
నవ ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా || ౩ ||
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మన్త్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనమ్ || ౪ ||
క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || ౫ ||
గిరిగహ్వార ఆరణ్యే వ్యాఘ్రచోరామయాదిషు |
రణే చ మరణే చైవ శమదం పరమం శుభమ్ || ౬ ||
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయేత్సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ || ౭ ||
ఇతి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం |
శుభం !!
Nrusimha dwadasa Nama Stotram,
#nrusimha #dwadasa #stotram