Online Puja Services

నృసింహ ఋణవిమోచన స్తోత్రం

3.145.85.74

అప్పుల బాధ నుండీ రక్షించి లక్ష్మీ అనుగ్రహాన్నిచ్చే నృసింహ ఋణవిమోచన స్తోత్రం 
- లక్ష్మి రమణ 

అప్పులేని వారు మహిలో కానరారని వెనకటికో పెద్దాయన అస్తమానమూ చెబుతూ ఉండేవారు. ఆ మాట మన నిత్యజీవితంలో అక్షరసత్యమని నిత్యమూ సరికొత్తగా అనుభవంలోకి వచ్చేదే కదా ! ఈ నృసింహ ఋణవిమోచన స్తోత్రాన్ని నిత్యమూ పఠిస్తే, ఋణబాధల నుండీ విముక్తి లభిస్తుంది అని పండితుల సలహా . ఆ దివ్యమైన స్తోత్రాన్ని ఈ ఫాల్గుణ మాసంలో పఠించడం మరింత విశేషమైన ఫలితాన్నిస్తుంది . నిత్యామూ ఈ స్తోత్రాన్ని పఠించడం వలన ఋణాలు తొలగిపోవడమే కాకుండా , లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. 

నృసింహ ఋణ విమోచన స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 

              శుభం భూయాత్ !!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi