Online Puja Services

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

18.191.9.192

శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం, శక్తివంతం.ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది.మీ ఇంట్లో ఉండే వారి కోసం కుడా ఈ స్తోత్రాన్ని పఠించి స్వామి వారి అనుగ్రహం పొందండి 

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥
నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః

శ్రీ రాధా లక్ష్మి 

Quote of the day

Everything comes to us that belongs to us if we create the capacity to receive it.…

__________Rabindranath Tagore