శక్తి పీఠాలు ఎన్నో , ఎన్నెన్నో
శక్తి పీఠాలు ఎన్నో , ఎన్నెన్నో
ప్రతి కణము మరియు అణువు, అండ, పిండ, బ్రహ్మాండములన్నీ, శక్తి పీఠాలే.
అయితే, ఆది పరాశక్తి శ్రీ కనకదుర్గా మాతను ఆరాధించే పద్దతుల ఆధారంగా, దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Sakti Peethas) అంటారు.
ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.
శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గా దేవియే, అష్టాదశ శక్తి పీఠాలలో కొలువై ఉన్నారని , శ్రీ దేవీ పురాణం తేల్చి చెప్పడమే కాక,అష్టాదశ శక్తి పీఠాల పేరులను, ఆయా పీఠాలలోని అమ్మవారి నామములను, రోజుకు 18 మారులు, 40 దినములు పారాయణం చేయడం వలన సకల కోరికలూ నెరవేరగలవన్న రహాస్యాన్ని తెలియచేసింది.
ఆ పారాయణం, ఇలా చేయాలి.
ఓం దుర్గాయ్యై నమః
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
ఓం దుర్గాయ్యై నమః
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఓం దుర్గాయ్యై నమః
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
ఓం దుర్గాయ్యై నమః
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
ఓం దుర్గాయ్యై నమః
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
ఓం దుర్గాయ్యై నమః
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
ఓం దుర్గాయ్యై నమః
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
- శివకుమార్ రాయసం