Online Puja Services

చిన్నారులకి శ్రీకృష్ణుని రక్ష ఈ చిన్న స్తోత్రంతో సాధ్యం .

18.216.145.37

చిన్నారులకి శ్రీకృష్ణుని రక్ష ఈ చిన్న స్తోత్రంతో సాధ్యం .
- లక్ష్మి రమణ  

 విశ్వ స్వరూపమే భగవంతుని స్వరమై ఆవిర్భవించిన జ్ఞాన బాండాగారం భగవద్గీత. అంతటి బాండాగారాన్ని స్వయంగా తానే ఆచార్యుడై అందించారు శ్రీకృష్ణ పరమాత్మ . ఆ గురు స్వరూపుడైన పరమాత్మని కృష్ణాష్టకంతో ప్రార్ధిస్తే , జ్ఞానం సిద్ధిస్తుంది . పిల్లలకి దుష్ట శక్తుల నుండీ రక్షణ కలుగుతుంది.  ఇష్టకామ్యార్థ సిద్ధి ప్రాప్తిస్తుంది. చిన్నప్పుడు మన ఇంట్లో నానమ్మలూ , తాతయ్యలూ నిద్రపుచ్చేప్పుడు మన నోటికి వచ్చేలా రోజూ కృష్ణాష్టకాన్ని చెబుతూ ఉండేవారు . ఈ అలవాటుని ఇప్పుడు మనం మన వారసత్వంగా ముందు తరానికి అందించాలి . నిత్యమూ ఉండే బ్రతుకు బిజీలో ఉండి ఈ దివ్యమైన స్తోత్రాన్ని విస్మరిస్తున్నారా !! అలా అస్సలు జరగనీయకండి . కోటిజన్మల పాపాన్నయినా కేవలం స్మరణ మాత్రం చేత నాశనం చేయగలిగిన ఈ చక్కని స్తోత్రాన్ని ఇక్కడ మీకోసం ఇస్తున్నాం , ఆ జగన్నాధుని ఆశీస్సులని అర్థిస్తూ … 

శ్రీ కృష్ణాష్టకం

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 1

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 2

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥ 3

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 4

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 5

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 6

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 7

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 8

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ 9

ఇతి శ్రీ కృష్ణాష్టకం సంపూర్ణం . 

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు !!
శుభం భవతు !!

 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya