దుష్టశక్తుల ప్రభావాలు, ద్రుష్టి దోషాలూ తొలగిపోతాయి.
ఇది చదివి విభూతి పెడితే, పిల్లలకి గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు, ద్రుష్టి దోషాలూ తొలగిపోతాయి.
- లక్ష్మీరమణ
పసిపిల్లలు కొన్ని సార్లు అదేపనిగా ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా ఇలాగే చిరాకు పడుతూ ఉంటారు . వాళ్లకి ఏమయ్యిందో తెలీదు . ఎందుకు ఏడుస్తున్నారా చెప్పలేరు . అలాంటప్పుడు విభూతి చేతిలో పట్టుకొని ఇక్కడ చెప్పిన శ్లోకాన్ని చెప్పి దానిని పిల్లల నుదుట, కంఠాన, వక్షస్థలమున, భుజాలపైన రాయాలి. అనుకోకుండా వారికి గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు, ద్రుష్టి దోషాలూ ఏవైనా ఉండి ఉంటె , దీనివల్ల తొలగిపోతాయి.
బాలుడిగా శ్రీకృష్ణుడు చేసిన ఘనకార్యాలు ఈ శ్లోకంలో ఉన్నాయి చూడండి . పసిబిడ్డడై అమ్మదగ్గర పాలు తాగుతున్న వయసులో, తాను పిల్లాడికి పాలిస్తానని వచ్చిన పూతన ప్రాణం తీశాడు . చేసిందంతా చేసి, కొండలా పడి ఉన్న ఆ రాక్షసి శరీరం మీద చిరునగవులు చిందిస్తూ ఆడుకుంటున్న బిడ్డని చూసి యశోదమ్మ పరుగున వచ్చి గుండెకు హత్తుకుంది . మధుకైటభులనే రాక్షసులని మట్టుబెట్టిన ఆ శ్రీ హరి ఇంతటి ముద్దుల చిన్నారిగా వచ్చారు కనుకనే, కంసుడు పంపంగా వచ్చిన పూతన, ఆ తర్వాత వచ్చిన రాక్షసులు, కంసుడూ కూడా బాల కృష్ణుని చేతిలో హతమయ్యారు.
బాలునిగా ఇన్ని ఎదుర్కొన్న స్వామి కదా ! అందుకే బాలల రక్షకి ఉపక్రమించి ఉంటారు. ఆయన్ని తలచుకొని, రక్షపెడితే, పిల్లలకి దుష్ట గ్రహాలూ, దుష్ట పీడలు , దుష్టమైన దృష్టి బాధలనుండి ఆ వాసుదేవుని అండతో , అనుగ్రహంతో రక్ష లభిస్తుంది అని నమ్మిక .
1.వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః !
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం!!
2.కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభ మర్దనః !
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః!!
3.మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన !
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాత్రు గ్రహానపి!!
4.బాలగ్రహాన్విశేషేణ ఛింది ఛింది మహాభయాన్!
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం!!
ఈ శ్లోక మంత్రాల వలన సర్వగ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగుతాయి అని పండితులు చెబుతున్నారు. . శ్రీకృష్ణుని రక్షణ లభింపజేసే మంత్రమయ శ్లోకాలివి. శుభం .
#distimantram #drustidoshanivarana #krishna
Tags: disti, drusti, dusta sakthi, sarva graha dosha, krishna, mantra, mantram